టీడీపీకి మంత్రి బొత్స సవాల్ : నిరూపిస్తే ఇప్పుడే..రాజీనామా చేస్తా

టీడీపీ సభ్యులకు మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాల నిర్మించిన ఇళ్లలో ఫర్నీచర్ ని సమకూర్చామని టీడీపీ సభ్యులు అసెంబ్లీలో చెప్పటంపై మంత్రి బొత్స మండి పడ్డారు. టీడీపీ పాలకు నిర్మాణ పథకాల నిర్మించిన పేదల ఇళ్లకు ఫర్నీచర్ ని సమకూర్చామని నిరూపిస్తే ఇప్పటికిప్పుడే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని..జేబులో పెన్ను తీస్తూ..సవాల్ విసిరారు.
పేదల ఇళ్లకు ఇంట్లో ఫర్నీచర్ మంచాలు..కుర్చీలూ, వంట సామన్లు వగైరాలనీ..ఫర్నీచర్ అంటే అర్థం ఏంటో అసలు టీడీపీకి తెలుసా..తెలిస్తే చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇలా ప్రతీ అంశంలోను అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈరోజు రాష్ట్రంలో మద్యపాన నిషేధం విషయంలో కూడా ఇరు పక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగింది.