ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా బీజేపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం పట్ల టీడీపీ ఖండిస్తోంది. కేవలం కుట్రల్లో భాగంగానే దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. టీడీపీ నేతల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ దాడులను సీఎం బాబు రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ దుయ్యబట్టారు. అవినీతితో అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ఎన్నికల్లో నెగ్గాలని టీడీపీ చూస్తోందన్నారు.
Read Also : శత్రువులపై దాడులు చేస్తే… ఇక్కడ కొందరు ఏడ్చారు
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. ఈ మధ్యలో ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతున్నాయి. టీటీడీ ఛైర్మన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంపై ఐటీ దాడులు జరిగాయి. సీఎం రమేశ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు జరిగాయి. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలు గుప్పించారు. దీనికి ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం జీవీఎల్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.
సోదాలకు వెళుతున్న అధికారులను అడ్డుకుంటున్న టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు. లక్షల..కోట్ల అవినీతి సొమ్మును ఎన్నికల్లో పంచి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. ఐటీ అధికారులు వారి పని వారు చేసుకుంటుంటే వారిని అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ దాడులను రాజకీయ రంగు పులమడం బాబు దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు జీవీఎల్.
Read Also : బై..బై బాబు : జగన్ను సీఎం చేయండి – షర్మిల