గవర్నమెంట్ జీతాలు ఇవ్వట్లా :ఆగిన గుండె ఆపరేషన్లు

కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. గత నాలుగు నెలలుగా డాక్టర్లకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవటంతో డాక్టర్లు రాజీనామా చేశారు. దీంతో హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు గత పది రోజులు నిలిచిపోయాయి. దీంతో గుండె సమస్యలతో వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం తమను పట్టించుకోవటంలేని రోగులు..వారి బంధువులు ఆరోపిస్తున్నారు. రోగుల కుటుంబ సభ్యులు హాస్పిటల్ సూపరిండెంటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం..డాక్టర్ల మధ్యలో అమాయక ప్రజలు ఇబ్బందులు పడతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు లేక పర్ఫ్యూజనిస్ట్ ఉద్యోగం మానేసిన నేపథ్యంలో రెండు వారాలుగా గుండె ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో రోగులు అల్లాడుతున్నారు. వైద్యాధికారుల నిర్లక్ష్యంపై రోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారులు ఆపరేషన్ల కోసం రోగుల నిరీక్షిస్తున్నారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో రోగులు..వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరూ పట్టించుకోరా అంటూ విమర్శలు వినిపిస్తుయి.