ఏపీలో ఓటుపై వడదెబ్బ : 7 గురు మృతి

ఏపీ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్ధులు విలవిలలాడుతున్నారు.

  • Publish Date - April 12, 2019 / 04:05 AM IST

ఏపీ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్ధులు విలవిలలాడుతున్నారు.

ఏపీ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్ధులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలువురు వడదెబ్బ బారిన పడ్డారు. ఏప్రిల్ 11వ తేదీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా 7 గురు మృతి చెందారు. ఓట్లు వేసేందుకు వెళ్లిన కొందరు వడదెబ్బకు గురై అక్కడికక్కడనే మృతి చెందగా మరికొందరు ఇంటికెళ్లి మృత్యువాతపడ్డారు. 
Read Also : చెక్ చేసుకోండి : ఏపీ ఇంటర్ ఫలితాలు

–  కృష్ణా జిల్లాలో ఓ వృద్దురాలు పోలింగ్ కేంద్రం వద్దే కుప్పకూలి చనిపోయింది. కంచికచర్ల మండల పరిధిలోని మోగులూరులో ఓటు వేసేందుకు వచ్చిన జోజెడ్ల నీలమ్మ (72) కుమార్తెతో కలిసి వచ్చింది. ఓటు వేసి బయటకు రాగానే కుప్పకూలింది. అక్కడనే ఉన్న పోలీసు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూసింది.
–  అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన ఉలవల నరసింహులు (55) ఓటు వేసేందుకు వచ్చారు. ఓటు వేసి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. ఆరోగ్యం విషమించి చనిపోయాడు.
–  చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి పెద్దపంజాణి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన మొగిలమ్మ (85) వడదెబ్బకు గురై మృతి చెందింది. 
–  అమరావతి మండలం కర్లపూడిలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రసాదరావు (70) క్యూ లైన్‌లోనే నిలబడి మృతి చెందాడు. 
–  తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కె.ఇ.చిన్నయ్యపాలెంలో ఓటేసేందుకు వచ్చిన మాణిక్యం (60) వడగాల్పులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇంటికెళ్లిన కాసేపటికే మృ‌తి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 
–  కర్నూలు జిల్లా కోడముమూరు నియోజకవర్గంలోని పులకుర్తి మంజరా గ్రామం బైందొడ్డికి చెందిన పెద్ద బోయ వెంకటేశ్వర్లు (65) ఓటు వేసి ఇంటికి వస్తూ ఎండ దెబ్బతో కన్నుమూశాడు. 
–  పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన పడాల మనోజ్ (18) వడదెబ్బతో మృతి చెందాడు. 
Read Also : ఆకతాయి అసభ్య ప్రవర్తన : చెంప పగలగొట్టిన ఖుష్బూ

ట్రెండింగ్ వార్తలు