వైసీపీ నుంచి భర్త..ఇండిపెండెంట్ గా భార్య

ఏపీలో ఒక అసెంబ్లీ స్థానానికి భార్యాభర్తలు పోటీకి దిగారు.అయితే భర్త ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగగా,భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.కృష్ణా జిల్లాలో ఈ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది.
 
కష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి రంగంలో ఉండగా.. ఆయన భార్య కమల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గురువారం(మార్చి-28,2019) నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రిటర్నింగ్ అధికారి ఈ వివరాలను తెలిపారు. పార్థసారథికి ఫ్యాన్‌ గుర్తును కేటాయించగా…కమలకు బెల్టు గుర్తు కేటాయించారు. వీరి కుమారుడు నితిన్‌ కృష్ణ దాఖలు చేసిన నామినేషన్‌ ను పరిశీలనలో తొలగించారు. ఒకే నియోజకవర్గంలో భార్యాభర్తలు పోటీలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, వైసీపీ నుంచి పార్థసారధి ఉండగా.. జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి లంకా కమలాకర్‌ రాజు పోటీలో ఉన్నారు.