లోహిత్‌పూర్‌ లో తొలి ఓటు పడింది

  • Published By: veegamteam ,Published On : April 7, 2019 / 05:27 AM IST
లోహిత్‌పూర్‌ లో తొలి ఓటు పడింది

Updated On : April 7, 2019 / 5:27 AM IST

లోహిత్‌పూర్‌ : దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న తరుణంలో అప్పుడే తొలి ఓటు పడింది. ఎన్నికలు 11న జరుగనున్నాయి. కానీ మొదటి ఓటు అప్పుడే పడింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న 80 మంది ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) తమ సర్వీసు ఓట్లను శుక్రవారం (ఏప్రిల్ 5)  వినియోగించుకున్నారు. 
 

ఉత్తరాఖండ్, గుజరాత్, కర్ణాటక, బీహార్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ర్టాల్లోని పలు నియోజకవర్గాల ఐటీబీపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోహిత్‌పూర్‌లోని ఎనిమల్ ట్రైనింగ్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈశాన్య రాష్ర్టంలో సర్వీసు ఓటును వినియోగించుకోవడం ఇదే మొదటిసారి కావటం విశేషం. ఓట్లు వేసిన ఈ పోస్టల్ బ్యాలెట్లు మే 23న జరిగే ఓట్ల లెక్కింపు జరగనున్న క్రమంలో ఆయా ప్రాంతాలకు ఈ పోస్టల్ బ్యాలెట్లు చేరుకోనున్నాయి.