జనసేన అభ్యర్ధుల నామినేషన్‌లు తిరస్కరణ

నామినేషన్‌ల అంకం పూర్తి అయింది. ఇప్పుడు అంతా ఎవరి నామినేషన్ ఆమోదం పొందింది. ఎవరిది పొందలేదు అనే విషయంపైనే చర్చ జరుగుతోంది.

  • Publish Date - March 27, 2019 / 02:30 AM IST

నామినేషన్‌ల అంకం పూర్తి అయింది. ఇప్పుడు అంతా ఎవరి నామినేషన్ ఆమోదం పొందింది. ఎవరిది పొందలేదు అనే విషయంపైనే చర్చ జరుగుతోంది.

నామినేషన్‌ల అంకం పూర్తి అయింది. ఇప్పుడు అంతా ఎవరి నామినేషన్ ఆమోదం పొందింది. ఎవరిది పొందలేదు అనే విషయంపైనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గుడివాడలో జనసేనకు షాక్ తగిలింది. జనసేన అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. జనసేన తరపున రఘునాథరావు, గణేశ్వర రావులు నామినేషన్ వేయగా.. నామినేషన్ పత్రాల్లో జత చేసిన గుర్తింపు పత్రాల్లో లోపాల కారణంగా వారి నామినేషన్లను ఈసీ తిరస్కరించింది.
Read Also : ఆరు నెలల్లో మూడు లక్షల ఉద్యోగాలు : పవన్ కళ్యాణ్

అటు పాయకరావుపేట జనసేనలో కూడా వివాదం రేగింది. జనసేన తరపున రాజబాబు, శివదత్‌లు ఇద్దరూ నామినేషన్లు వేశారు. దాంతో అసలైన అభ్యర్థి తానంటే తానంటూ రాజబాబు, శివదత్‌ గొడవలు పడుతున్నారు. పులివెందుల జనసేన అభ్యర్థి చంద్రశేఖర్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది.

ఇక కృష్ణా జిల్లాలోనే పెనమలూరు బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌, వైసీపీ అభ్యర్థి కె.పార్థసారథి నామినేషన్లు పెండింగ్‌లో పడ్డాయి. కేసుల వివరాలు దాచిపెట్టారంటూ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో వీరి నామినేషన్‌లను రిటర్నింగ్‌ అధికారి మిషా సింగ్‌ వీరి నామినేషన్లను ఎన్నికల కమిషన్‌ పరిశీలనకు పంపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ అభ్యర్థి రవి సూర్య బీ-ఫామ్‌ ఇవ్వకపోవడంతో నామినేషన్‌ తిరస్కరించారు. పులివెందుల జనసేన అభ్యర్థి చంద్రశేఖర్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. 
Read Also : పార్టనర్ యాక్టర్ నామినేషన్ వేస్తే వచ్చేది టీడీపీ కార్యకర్తలే