కనుమ నాడు మినుము తినాలి.. ఎందుకంటే..

సంక్రాతి పండుగలో మూడోరోజు కనుమ. కనుమ పండుగ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే కనుమ పండుగ స్పెషల్ తినటమే.తిండి కలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్..అనే మాట ఈ కనుమ పండుకు సరిగ్గా సరిపోతుంది. ఈ పండుగ రోజున మనం తినటమే కాదు వ్యవసాయంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కూడా కనుమ రోజున వండిన పిండి వంటలను పెడతారు.
సంప్రదాయమే సామెత..దాంట్లో ఉంది ఆరోగ్య రహస్యం
కనుమ నాడు మినుము తినాలనేది సామెత. కనుమరోజు మినుములు తినాలి అన్న సామెత వెనుక కూడా అనేక అంతర్థాలు కనిపిస్తాయి. పితృదేవతలను తల్చుకుంటూ గారెలు వండుకోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ఈ సమయంలో క్రమేపీ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి, మినుములు అందుకు అనుగుణంగా శరీరాన్ని సంసిద్ధం చేస్తాయి. మినుములు తింటే ఒంట్లో వేడి పుడుతుంది. రాబోయే పనులకు తగిన సత్తువ లభిస్తుంది. మినుములతో చేసిన పిండివంటలు తింటే శరీరానికి చక్కటి బలం వస్తుంది. అందుకే మూడు పండుగల్లో భాగంగా..కనుమ రోజున మినుములతో చేసిన సున్ని ఉండలు. గారెలు, ఆవడలు చేసుకుంటారు.
కోడి కూర చిల్లి గారె వెరీ స్పెషల్ కాంబినేషన్
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. ముక్కనుమ రోజున ముక్కల భోజనం స్పెషల్.అంటే నాన్ వెజ్ (మాంసాహారం) కోళ్లను కోసుకుంటారు. మేకల్ని కోసుకుంటారు. కోడి కూరకు కాంబినేషన్ గా మినపగారెల్ని చేసుకుని లొట్టలేసుకుంటూ తింటారు. కోడి కూర చిల్లిగారె కాంబినేషన్ వెరీ వెరీ స్పెషల్. కనుమ రోజున తినగా మిగిలిన ముక్కల్ని ముక్కనుమ రోజు తింటారు.
మాంసాహారులు కాని వారు..మినుములతో చేసిన గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి..అందుకే శాఖాహార మాంసంగా పరిగణించి ఉంటారు మన పెద్దలు) తింటారు.