వరుసగా ఐదు సీట్లకు ఉప ఎన్నికలు రాబోతున్నాయా? బైపోల్స్ రేసు గుర్రాల కోసం బీఆర్ఎస్ వేట!
జూబ్లీహిల్స్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోందట.

KCR brs
Telangana bypolls 2025: తెలంగాణ పాలిటిక్స్ ఎవ్రీ వీక్ నెక్స్ట్ లెవల్ పీక్‌కు చేరుకుంటున్నాయి. ఒక పొలిటికల్ డెవలప్‌మెంట్ తర్వాత మరో పొలిటికల్ యాక్టివిటీతో ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ పేలుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సుప్రీం డైరెక్షన్స్ ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం బయలుదేరింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేసి బైఎలక్షన్స్ ఫేస్ చేయాలని డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. స్పీకర్ అనర్హత వేటు వేసే కంటే ముందే ఎమ్మెల్యే పదవులకు రిజైన్ చేయాలని భావిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఈ నలుగురు ఉన్నారట.
Also Read: విశాఖలో భారీ బహిరంగ సభకు జనసేన ప్లాన్.. జనసేన ఫ్యూచర్‌కు మరింత బూస్ట్.. ఇక 2029 ఎన్నికల్లో..
దానం నాగేందర్ కాంగ్రెస్ క్యాండిడేట్‌గా లోక్‌సభ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఔట్‌రైట్‌గా ఇరికిపోయారు. ఇక కడియం శ్రీహరి తన కూతురు కావ్యను కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్‌గా బలపరుస్తూ బీఫామ్ మీద సంతకం చేశారని అంటున్నారు. తెల్లం వెంకట్రావు అయితే కాంగ్రెస్ కండువా కప్పుకుని ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.
ఇక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా అనర్హత భయం వెంటాడుతోందట. సేమ్‌టైమ్ బాన్సువాడ లోకల్ పాలిటిక్స్‌తో పాటు చేరికప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారట. ఇలా ఈ నలుగురు స్పీకర్ వేటు వేసే కంటే ముందే పదవులకు రిజైన్ చేసి ఎన్నికలకు రెడీ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ సవాల్
మరోవైపు అపోజిషన్ బీఆర్ఎస్ ఉప ఎన్నికలకు సై అంటూ తొడలు కొడుతోంది. ఏకంగా పది నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌కు సవాల్ చేసి చర్చకు దారి తీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు పడటం ఖాయమని ఫిక్స్ అయిపోయిందట బీఆర్ఎస్. ఆ ముగ్గురితో పాటు పది మందిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది కారు పార్టీ.
జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత..ఆ మూడు నియోజకవర్గాలు లేకపోతే పది సీట్లకు ఉపఎన్నికలు రావొచ్చన్న అంచనాల్లో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారట. అయితే పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కసరత్తు చేస్తున్నారట.
ఉప ఎన్నికలు వస్తే గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని భావిస్తున్నారట. ఇప్పటికే కొన్ని నియోజకవవర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధులపై గులాబీ పార్టీ ఓ అభిప్రాయానికి వచ్చిందని అంటున్నారు. అందులో పటాన్‌చెరు నుంచి ఆదర్శ్ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఖైరతాబాద్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి, రాజేంద్రనగర్ నుంచి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ ఎల్.రమణ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక భద్రాచలంలో రేగా కాంతారావుకు, స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, బాన్సువాడ నుంచి ఆర్టీసీ మాజీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, గద్వాల నుంచి హనుమంతు నాయుడు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్. చేవెళ్ల నియోజకవర్గం నుంచి కొత్త వారికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ సతీమణి సునీతను బరిలోకి దించాలని ఇప్పటికే నిర్ణయించారు. (Telangana bypolls 2025)
అయితే జూబ్లీహిల్స్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోందట. అందుకే స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే జంపింగ్ ఎమ్మెల్యేల చేత సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రజా పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం..వారి పాలనకు ఈ ఉప ఎన్నికలను రిఫరెండంగా పెట్టాలని సవాల్ విసురుతోంది గులాబీ పార్టీ.
ఆ నాలుగు సీట్లకు ఎన్నికలు వస్తాయా.? పదికి పది సీట్లకు బైపోల్స్ ఖాయమా.? నలుగురు జంపింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనుకుంటున్నది నిజమా.? కాదా.? అటు అధికార కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతోంది.