నవజీవన్‌లో రైలు దొంగలు : పోలీసులకు కంప్లయింట్

  • Publish Date - March 4, 2019 / 03:50 PM IST

రైలు దొంగలు ఎక్కుయితున్నారు. ప్రయాణీకుల లాగానే ఎక్కి..సందడి లేని ప్రాంతం వద్దకు రాగానే దొంగలు విజృంభిస్తున్నారు. మారణాయుధాలు చూపించి అందినదాడికి దోచుకెళుతున్నారు. శుభకార్యాలకు..పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు వెళ్లే వారిని టార్గెట్ చేస్తుండడంతో ప్రయాణీకుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడి కలకలం రేపింది. 

మార్చి 04వ తేదీ సోమవారం సాయంత్రం మహిళల బోగిలోకి ఎక్కిన దుండగుడు కత్తితో బెదిరించి ఓ మహిళా ప్రయాణికురాలి మెడలో ఉన్న బంగారం దోచుకెళ్లాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, పెద్దవడ్లమూడి వద్ద జరిగిన ఈ ఘటన పై ఖమ్మంకు చెందిన సుజాత అనే బాధితురాలు విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రైల్వే పోలీసులు పట్టించుకోవడం లేదని ఖమ్మం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు సుజాత.