బెజవాడ రౌడీలు: బీరు బాటిల్‌తో కొట్టి చంపేశారు

బెజవాడ రౌడీలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో అన్నీ ప్రాంతాల కంటే బెజవాడలో రౌడీల అరాచకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే విజయవాడ కృష్ణలంలో రౌడీల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బెంజి సర్కిల్ వద్ద ఓ బారులో మందు తాగుతుండగా.. సద్ధామ్, ఇమ్రాన్ అనే ఇద్దరి గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో అనీల్ అనే వ్యక్తిపై విచక్షణా రహితంగా బీరు బాటిల్‌తో దాడి చేయగా చికిత్స పొందుతూ అనీల్ చనిపోయాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఓ కుర్చి విషయంలో అసలు గొడవ మొదలైనట్లు తెలుస్తుంది. బారులో కుర్చీని తీసుకునే విషయంలో వారిక ిగొడవ జరిగినట్లు చెబుతున్నారు.