మధ్యప్రదేశ్ లోని ఈ దేవాలయానికి ఇతర రాష్ట్రాల వారు రాకూడదని నిర్ణయించిన కమిటీ

  • Published By: nagamani ,Published On : July 23, 2020 / 11:13 AM IST
మధ్యప్రదేశ్ లోని ఈ దేవాలయానికి ఇతర రాష్ట్రాల వారు రాకూడదని నిర్ణయించిన కమిటీ

Updated On : July 23, 2020 / 11:46 AM IST

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జయినిలో కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండటంతో ఉజ్జ‌యిని‌ మహాకాళేశ్వర్వుడు ఆలయానికి కరోనా గ్రహణంపట్టింది. అందుకే కేవలం ఉత్తరప్రదేశ్ వాసులు తప్ప వేరే రాష్ట్రానికి చెందిన ఎవ్వరూ ఉజ్జ‌యిని‌ మహాకాళేశ్వర్వుడి దర్శించుకోవద్దంటూ పరిపాలన క‌మిటీ శనివారం (జులై 18,2020) తెలిపింది. స్వామిని దర్శించుకునే విషయంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆలయ కమిటీ ..ఇతర రాష్ట్రాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఆల‌య ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. క‌మిటీ తదుపరి నిర్ణ‌యం ప్ర‌క‌టించే వరకు మధ్యప్రదేశ్‌కు చెందిన‌వారు మాత్రమే మ‌హాకాళేశ్వ‌రుణ్ణి ద‌ర్శించుకోగవాలని చెబుతోంది.

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా మార్చి 21 న మూసివేసిన మహాకాళేశ్వ‌రుని ఆల‌యం 78 రోజుల తరువాత తిరిగి జూన్ 8న తెరుచుకుంది. రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ ఎక్కువగా ప్రభావితమైన జిల్లాలలో ఉజ్జయిని ఒకటి. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 942 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 71 మంది మృతిచెందారు. జిల్లాలో 798 మంది క‌రోనా బాధితులు చికిత్స అనంత‌రం కోలుకున్నారు.