చంద్రబాబే టార్గెట్: లేఖాస్త్రం సంధించిన ముద్రగడ పద్మనాభం

  • Publish Date - January 14, 2020 / 02:50 AM IST

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు ఉద్యమంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ముద్రగడ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు సంధించేవారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ లేఖలు రాస్తూ ఉండేవారు. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెద్దగా కనిపించలేదు. 

అయితే లేటెస్ట్‌గా మరోసారి చంద్రబాబునే టార్గెట్ చేస్తూ.. లేఖాస్త్రం సంధించారు. అప్పట్లో తాను చేస్తున్న ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేశారంటే ఇప్పుడు ముద్రగడ లేఖలో రాశారు. అప్పుడు తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారంటూ ఆరోపించారు. చంద్రబాబు తన కులం కోసం ఉద్యమం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. 

చంద్రబాబుకు ముద్రగడ రాసిన లేఖ ఇదే:

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,

ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం న‌మ‌స్కార‌ములు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీసు వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి వారిని మీ కాళ్ల కింద పెట్ట‌కొని మా జాతే కాదు.. ఎన్నో జాతుల వారిని లం… లం..కొడ‌కా, కొడితే దిక్కెవ‌డురా, అంటూ లాఠీల‌తో కొట్టించ‌డం, బూటు కాలితో త‌న్నించ‌డం అక్ర‌మ కేసులు పెట్టి బాధించ‌డం, ఏ స‌మ‌స్యపై అయినా (ప్ర‌త్యేక హోదాతో స‌హా) రోడ్డుమీద‌కు వ‌స్తే జైలుకే అని బెదిరించ‌డం, వృద్ధుల‌ను పోలీస్ స్టేష‌న్‌కు పిలిపించి, ల‌క్ష‌ల‌తో బాండు రాయించుకోవ‌డం, చ‌దువుకునే పిల్ల‌లు రోడ్డు మీద‌కు వ‌స్తే కేసుల‌లో ఇరుక్కుంటారు భవిష్య‌త్తు పాడ‌వుతుంది జాగ్ర‌త్త అని హెచ్చ‌రించ‌డం.. లాంటివి ఎన్నో బ్రిటిష్ వారి పాల‌న‌లో చెయ్య‌ని విధంగా మీ పాల‌న సాగింద‌న్న సంగ‌తి గుర్తులేదా? మాజీ ముఖ్య‌మంత్రిగారూ?

ఆఖ‌రుకి మా కుటుంబం మొత్తాన్ని మీరు, రాజ్యం పోయిన యువ‌రాజా క‌లిసి క‌సి తీరా అవ‌మానించి, లాఠీల‌తో కొట్టుకుని తీసుకువెళ్ల‌డ‌మే కాదు, హాస్పిట‌ల్ అనే జైలులో 14 రోజులు ఎటువంటి కాలకృత్యాలు తీర్చుకోకుండా, బ‌ట్ట‌లు మార్చుకోకుండా చిన్న గ‌దిలో బంధించి మా గ‌దిలోనే 6 మంది పోలీసుల‌తో నిత్యం కాపాలా పెట్టి మాకు ప‌గ‌లు, రాత్రులు నిద్ర‌లేకుండా చేసింది మీరు కాదా?

ఆఖ‌రుకు జైలులో అయినా కాల‌కృత్యాలు తీర్చుకోవ‌డంతో పాటు, బ‌ట్ట‌లు మార్చుకోమంటారు. ఇంత ఘోర‌మైన అవ‌మానం చేయ‌మ‌ని ఏ చ‌ట్టం చెబుతుందో ఇప్ప‌టికీ అర్థంకాని ప్ర‌శ్న.

భారత రాజ్యాంగం, చ‌ట్టం రూల్స్‌కి మీరు అతీతులా?
అప్ప‌టి మీ పాల‌న ప్ర‌జా పాల‌న చేస్తున్నానని ఎప్పుడైనా అనుకున్నారా? ఆనాడు మీరు పోలీసుల‌తో చేయించింది అరాచ‌క పాల‌న కాదా? పోలీసు వ్యవస్థను భ్రస్టు పట్టించింది మీరు కాదా?

ఈ రోజు పోలీసుల రాజ్యం అని బొంకుతున్నారు. పైగా 40 సంవత్సరాలు రాజకీయాలలో ముదిరిన వవృద్ధనారీ పతివ్రతను అని చెబుతుంటారు. చెప్పడానికి తమరు సిగ్గుపడకపోయినా.. వినడానికి…

మీ సామాజిక వర్గం స్తీలపై దాడి చేస్తే ఇదేనా ప్రజాస్వామ్యం అంటున్నారు కదా?

నా భార్య, కోడలుపై పోలీసులతో దాడి చేయించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మాజీ గారు?

మీ వారికి జరిగిన అవమానం గురించి జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసారే మాకు జరిగిన అవమానం గురించి లోకానికి చెప్పుకోకుండా మీడిమాను కట్టడి చేయడం ఏ చట్టం చెప్పిందో సెలవిస్తారా?

మాజీ గారు, నేను దీక్ష మొదలు పెట్టిన మొదటి రోజే పోలీసులతో ఎగిరి తన్నించి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టించారు కదా,

మీ 2 లక్షల కోట్లు ఆస్తులు నేను దొంగతనం చేసానా?
ఏ బ్యాంకులోనైనా దొంగతనం చేసిన సొత్తు (బంగారం, డబ్బు) నా ఇంటిలో ఉన్నదా? లేక ఏమైనా టె్రరరిస్టునా? అలా ఎందుకు నా ఇంటి తలుపులు బద్దలు కొట్టవలసి వచ్చిందో ఎప్పుడైనా చెప్పారా?

మీ అధికారం కోసం మా జాతికిచ్చిన హామీ కొరకు పాదయాత్ర చేస్తానంటే వేల మంది పోలీసులను యుద్ద సామాగ్రితో గ్రామాలలో కవాతు చేయించి పాకిస్తాన్‌ మీదకు యుద్దానికి పంపినట్లుగా పంపి గౌరవ సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం పాదయాత్ర చేయకూడదని పోలీసుల చేత చెప్పించి చేయనివ్వలేదే?
ఆ నిబంధనలు ఇప్పుడు మీకు వర్తించవా మాజీ గారూ?

మా ఉద్యమాన్ని చూపించొద్దని అన్ని మీడియా సంస్థలకు మీ పాలనలో ఆదేశాలు ఇచ్చే వారు కదా? ఈ రోజు మీకు సంబంధించిన మీడియాలో చెప్పిందే చెప్పి మీ కావాలిసిన పత్రికలలో అన్ని పేజీలలో రాసిందే మరీమరీ రాయించి మీడియాను మీ సామాజిక వర్గానికే ఉపయోగించుకుంటున్నారు కదా, ఆ మీడియా సంస్థలలో ఇతర కులాలకు వాటా (చందాదారులం కాదా) లేదా?
ఇతరుల వార్తలు మీ వార్తలు లా చూపమని ఎందుకు చెప్పలేక పోయారు. మీది సంసారం, ఇతరులది వ్యభిచారమా? మాజీ గారు?

ఆ రోజు ఎవరి వద్ద రూపాయి చందా కూడా తీసుకోకుండా ఉద్యమం చేస్తే కొన్ని వందల కోట్లు వైసీపీ ఇచ్చిందని మీ ఇంటెలిజెన్స్‌ ఏబీవీ గారు సలహాతో తప్పుడు ఆరోపణలు చేయించారు కదా ఎన్నో సార్లు రుజువులతో బహిరంగ పర్చమని అడిగేవాడిని దబ్ము, ధైర్యం లేక తోక ముడిచేవారు నిజం కాదా? చందాలతో ఉద్యమం చేయకపోయినా, చేసినట్లు అబద్దాలు చెప్పిన నిప్పులాంటి మీరు ఈ రోజు జోలి పట్టడానికి సిగ్గుగా లేదా?

రాక్షసుల పాలన, బ్రిటీష్‌ వారి పాలన పుస్తకాలలో చదివాను, పెద్దలు చెబితే విన్నాను. ఆ పాలనను మించిపోయింది మీ పాలన. మీ పాలన తెలంగాణకు, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌వారు మీ నుండి విముక్తి పొంది అదష్టవంతులయ్యారు.

దేశ ప్రధాని అయ్యి ఇటువంటి పాలన దేశానికి రుచి చూపాలని మీరు, మీ యువరాజా వారు రాష్ట్రానికి చూపాలని చాలా తహతహలాడారు. నిజం కాదా మాజీ గారు?

మీ జీవితం అంతా అబద్దాలు చెప్పడం, వెన్నుపోటు పొడవటం, మామగారిని చెప్పులతో కొట్టించడం, ఇప్పుడు చెప్పులు విడిచి మామగారు ఫొటోకి దండ వేయడం, ప్రజలను హింసించి పైశాచిన ఆనందం పొందడం స్వాగతించి విశ్రాంతి తీసుకోండి.

మీ రాక్షస పాలనలో ఇంకా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వాటిని బయటకు తీయించుకోకండి