రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి

  • Publish Date - March 17, 2019 / 12:01 PM IST

మైసూరా రెడ్డి.. తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. కడప జిల్లా రాజకీయాలలో ప్రముఖ నేతగా వెలిగిన మాజీ మంత్రి మైసూరారెడ్డి. వైఎస్‌తో విబేధించి టీడీపీలో చేరారు. రాజ్యసభ టెర్మ్ పూర్తయ్యే సరికి.. రెన్యూవల్ చేసే అవకాశం లేదని తేలిపోయి.. వెళ్లి వైసీపీలో చేరారు. అయితే కొన్నాళ్లగా వైసీపీకి కూడా దూరంగా ఉంటున్న మైసూరా రెడ్డి జనసేనలోకి చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో మళ్లీ రాయలసీమ గళం పట్టుకున్న మైసూరా.. రాయలసీమకు ప్రభుత్వం న్యాయం చేయట్లేదంటూ ఉధ్యమం మొదలెట్టారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోనే మళ్లీ మైసూర రెడ్డి రాయలసీమ గళం అందుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే అటువంటి వార్తలు అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ మైసూరా రెడ్డి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనపై కడపలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఆయన.. రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానని, అవసరమైతే అన్ని పార్టీలనూ కలుపుకుని పోరాడతానంటూ స్పష్టం చేశారు. రాయలసీమ హక్కుల సాధన నిమిత్తం మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాయలసీమ సమస్యల పరిష్కారానికి మాజీ సీఎస్ అజయ్ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు మైసూరా ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు