మెగా టీం : జనసేనలోకి నాగబాబు – నరసాపురం ఎంపీగా పోటీ

  • Publish Date - March 20, 2019 / 06:52 AM IST

జనసేన పార్టీలోకి పవన్ కల్యాణ్ అన్నయ్య ఎంట్రీ ఇచ్చేశారు. ఇన్నాళ్లు తెర వెనక ఉండి సపోర్ట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో జాయిన్ అయ్యారు. ఈ ఎన్నికల్లోనే పోటీ చేస్తున్నారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది పార్టీ.
Read Also :దొడ్డిదారిన కాదు.. రాయల్‌గా తీసుకొచ్చా : నాగబాబు ఎంట్రీపై పవన్

జనసేన పార్టీలోకి నాగబాబు ఎంట్రీతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. మెగా ఫ్యామిలీ నుంచి పోటీకి కూడా దిగుతుండటంతో.. అందరిలో ఆసక్తి నెలకొంది. నరసాపురం ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున బీవీ శివరాంరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున రఘురాం కృష్ణంరాజు బరిలో ఉన్నారు. వీళ్లతో నాగబాబు ఢీకొట్టనున్నారు. 

నరసాపురం నుంచి కొణిదెల నాగబాబు పోటీతో.. ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. ఇద్దరు ఉద్దండులతో ఎన్నికల యుద్ధానికి దిగుతున్న నాగబాబు.. జనసేన జెండాను ఎగరేస్తారా లేదా అనేది ఇంట్రస్టింగ్ డిస్కషన్ అయ్యింది.

నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం,పాలకొల్లు, ఆచంట అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి 

Read Also :మా ఫ్యామిలీలో చంపుకునేంత గొడవలు లేవు : వివేకా కుమార్తె సునీత

ట్రెండింగ్ వార్తలు