కన్నతండ్రిపై తన ప్రేమను చాటుకున్నాడు ఓ కొడుకు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి బహుమతిగా బైక్ ఇచ్చి రుణం తీర్చుకున్నాడు. అది మామూలు బైక్ కాదు మరీ.. ఇప్పుడా బైక్ అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. రయ్‌మంటూ ఆ బైక్ పై వెళ్తున్న తాతకు చుట్టుపక్కల గ్రామాల్లో క్రేజ్ పెరిగింది. కరీంనగర్ జిల్లా రామడగు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన తాత పేరు లింగయ్య. ఈయన ఇప్పుడు రామడుగు మండలంలో ఓ ప్రత్యేక బైక్ రైడర్‌గా పేరుగాంచారు. లింగయ్య అందరూ వాడే బైక్‌లా కాకుండా.. ఓ కొత్త రకం బైక్ (ఎలక్ట్రిక్) వాడుతుండటం దాన్ని ప్రత్యేకంగా నడుపుతూ రోడ్ పై దూసుకెళ్తుండటంతో అంతా విచిత్రంగా చూస్తున్నారు.
గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటాడు లింగయ్య. కొడుకు మోహన్ ప్రాజెక్టు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంలో ఉన్న ఓ వాహనాన్ని చూశాడు. తన తండ్రి పొలానికి వెళుతుండడం..ఇతరత్రా పనులు చేసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడం మోహన్‌ను కలిచివేసింది. ఈ సమస్యలకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు.
వెంటనే ఎలక్ట్రిక్ బైక్ ను కొని నాన్నకు ఇచ్చాడు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే..45 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. చూస్తే చిన్న పిల్లలు ఆడుకొనే బొమ్మ వస్తువులా కనిపిస్తుంది. ఈ వాహనంపై లింగయ్య రోజు పొలానికి వెళుతున్నాడు. ఎరువు బస్తాలను సైతం ఈ వెహికల్ పై తీసుకొస్తున్నాడు.
Read More : తెలంగాణలో ఇకపై పూటకూళ్ల ఇళ్లు