నేను హర్ట్ అయ్యా: సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

సాంఘిక సంక్షేమ మంత్రి పినపె విశ్వ రూప్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై మంగళవారం అసెంబ్లీలో ఆందోళన జరిగింది. టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. వైసీపీ నాయకులు రోజాతో పలువురు టీడీపీని సహకరించమని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు శాంతించలేదు.
ఈ బిల్లును కావాలనే వివక్ష చూపిస్తూ మాట్లాడేందుకు అవకాశమివ్వడం లేదని వైసీపీ నాయకులు వాదించారు. అయినప్పటికీ వేరెవ్వరినీ మాట్లాడనివ్వకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ వరకూ వెళ్లి జై అమరావతి అంటూ ముట్టడి ప్రయత్నం చేశారు.
దీనిపై విసుగు చెందిన స్పీకర్ తమ్మినేని ‘ఐ యామ్ ప్రొటెస్టింగ్ ద అటిట్యూడ్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్’ అని కుర్చీలోంచి వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనకు నిరసన తెలియజేస్తున్నా. నిజంగా నేను హర్ట్ అయ్యా’ అని చెప్పి వెళ్లిపోయారు.