‘గట్టిగా అరవకండీ..కరోనా వస్తుంది’ : అసెంబ్లీలో స్పీకర్ డైలాగ్..నవ్వులే నవ్వులు..

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ విపిన్ సింగ్ పర్మార్ తన సీట్లో కూర్చున్నారు. అసెంబ్లీలో మీటింగ్ అనగానే శాసన సభ్యుల వాదోపవాదాలు, చర్చలు సర్వసాధారం. అధికారంలో ఉన్న పార్టీ నేతల విసుర్లు..ప్రతిపక్ష పార్టీ నేతల విమర్శలు మామూలే. వారందరినీ నియంత్రిస్తూ..అదుపు చేసే క్రమంలో మంగళవారం (సెప్టెంబర్ 8,2020) స్పీకర్ విపిన్ సింగ్ మాట్లాడుతూ సమావేశంలో నవ్వులు పూయించారు. ‘గొంతు చించుకోకండి.. కరోనా వచ్చుద్ది’ అని సభ్యులను అనడంతో సభలో ఒక్కసారిగా అందరూ నవ్వారు.
కరోనా వైరస్ దృష్ట్యా అసెంబ్లీకి వచ్చే సభ్యులు అందరికీ కరోనా నిబంధనలపై స్పీకర్ విపిన్ సింగ్ సూచనలు చేశారు. ముఖాలకు మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఈక్రమంలో సభ్యుల మధ్య కాస్త గలాటా జరిగింది. దీంతో సభ్యులను గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. దాదాపు కేకలు వేస్తున్నట్లుగా అరుస్తున్నారు. దీంతో స్పీకర్ వారిని గట్టిగా..మాట్లాడవద్దని.. అలా పెద్దగా వాదించడం వల్ల కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుందని స్పీకర్ అన్నారు. దీంతో సభలోని సభ్యులంతా హాయిగా నవ్వేశారు.
https://10tv.in/american-detroit-woman-found-alive-at-detroit-funeral-home-after-being-declared-dead/
అనంతరం సభలో కొందరు సభ్యులు ప్రతిపక్షనేత ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో నిన్న పాల్గొన్నవారిలో రీటా దేవీ అనే ఎమ్మెల్యేకు సాయంత్రం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. మాక్కూడా వచ్చిందా ఏంటీ అంటూ అందరూ టెస్టులు చేయించుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం హిమాచల్ శాసనసభ్యుల్లో మంత్రి మహేందర్ సింగ్, ఎమ్మెల్యే రీటాదేవీ, లక్విందర్‌సింగ్ ముగ్గురికి కరోనా సోకింది. దీంతో వారిని సభకు రావొద్దని.. హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని స్పీకర్ సూచించారు.