ఇంకో రెండు షోలు – పర్మిషన్ గ్రాంటెడ్

ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9నుండి 16 (8రోజులు), వినయ విధేయ రామ జనవరి 11నుండి 19 (9రోజులు) వరకు, అదనంగా రెండు షోలు ప్రదర్శింపబడతాయి.

  • Published By: sekhar ,Published On : January 8, 2019 / 08:48 AM IST
ఇంకో రెండు షోలు – పర్మిషన్ గ్రాంటెడ్

Updated On : January 8, 2019 / 8:48 AM IST

ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9నుండి 16 (8రోజులు), వినయ విధేయ రామ జనవరి 11నుండి 19 (9రోజులు) వరకు, అదనంగా రెండు షోలు ప్రదర్శింపబడతాయి.

స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు (ఫస్ట్ పార్ట్) జనవరి 9న గ్రాండ్‌గా రిలీజవనుంది. మరోవైపు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వినయ విధేయ రామ సినిమా జనవరి 11న రంగంలోకి దిగబోతుంది. ఈ రెండు సినిమాలకు రిలీజ్ అయిన రోజు నుండి దాదాపు వారానికి పైగా, రోజుకి రెండు ఎక్స్‌ట్రా షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సంక్రాంతి సీజన్ కావడం, సరిపడినన్ని థియేటర్స్ ఉన్నా, రద్దీ ఎక్కువ ఉండడం వల్ల, ఉదయం 5గంటలనుండి, ఉదయం 11గంటల మధ్యలో అదనంగా మరో రెండు షోలు వేసుకునే వీలు కల్పించాలని, ఆయా సినిమాల నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరడంతో, ప్రభుత్వం మరో రెండు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9నుండి 16 (8రోజులు), వినయ విధేయ రామ జనవరి 11నుండి 19 (9రోజులు) వరకు, అదనంగా రెండు షోలు ప్రదర్శింపబడతాయి.