తెలంగాణలో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయిన క్రమంలో ఆ పార్టీకి సినియర్ నాయకులు సైతం దూరం అవుతున్నారు.
తెలంగాణలో టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయిన క్రమంలో ఆ పార్టీకి సినియర్ నాయకులు సైతం దూరం అవుతున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మండవ వెంకటేశ్వరరావు.. కేసిఆర్ పిలుపు మేరకు ఆ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందుగానే మండవ టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి సపోర్ట్ చేయాలని కోరారు. ఈ సమయంలో రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కేసీఆర్ వెంటే ఉన్నారు.
తెలంగాణలో టీడీపీ పోటీ చేయని పరిస్థితిలో టీడీపీ ఓటు బ్యాంకే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కేసిఆర్.. ఆ పార్టీ ముఖ్య నేతలను ఆకర్షించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మండవను పార్టీలోకి చేర్చుకున్నట్లు తెలుస్తుంది.
Read Also : చంద్రబాబుకు ఓటేస్తే పాకిస్తాన్ ప్రధానికి ఓటేసినట్లే!