జనసేన సభలో అపశృతి: కార్యకర్తలకు విద్యుత్ షాక్

  • Publish Date - November 3, 2019 / 12:40 PM IST

ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్‌లో అపశృతి చోటుచేసుకుంది. సభావేదిక వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే సభావేదిక వద్ద ఉన్న బారికేడ్లలో విద్యుత్ ప్రవహించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

బారికేడ్లకు సరఫరా అయిన విద్యుత్ కారణంగా జనసేన కార్యకర్తలకు విద్యుత్ షాక్ తగిలింది. జనసేన నాయకులు ఊహించిన దానికంటే ఎక్కువ రావడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. టీడీపీ నేత అయ్యన్న పాత్రడు మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆ ప్రాంతం అంత క్లియర్ చేయించారు పోలీసులు.