ప్రభుత్వానికి మూడు సంవత్సరాల టైం ఇవ్వండి..అప్పటిలోగా..ఆస్పత్రులు, స్కూళ్ల పరిస్థితిని మార్చివేస్తానన్నారు సీఎం జగన్. దశల వారీగా వీటిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి..ఎక్కడా అవినీతి లేకుండా చేస్తామన్నారు. అక్టోబర్ 02వ తేదీ జిల్లాలోని కరపలో సచివాలయ ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం నూతన ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడారు..
గ్రామాల్లో ఉన్న ప్రతి స్కూల్‌కు సంబంధించిన ఫొటోలను తీసుకరావాలని చెప్పడం జరిగిందని..స్కూళ్లల్లో ఉన్న పరిస్థితిని మార్చివేయడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు క్రియాశీలక పాత్రలు పోషిస్తాయన్నారు. ప్రస్తుతం ఏపీలో 44 వేలకు పైగా పాఠశాలలున్నాయని, ప్రతి సంవత్సరానికి 15 వేలకు సంబంధించిన స్కూళ్ల ఫొటోలను తీసి సచివాలయ బోర్డులో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే..అభివృద్ధి చేసిన అనంతరం నాడు..నేడు అంటూ ఫొటోలను డిస్ ప్లే చేస్తామన్నారు.
బాబు హాయంలో ఆస్పత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. సంవత్సరానికి కొన్ని ఆస్పత్రులను తీసుకుని నెలకొన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. స్కూళ్ల మాదిరిగానే ఆస్పత్రుల ఫొటోలను బోర్డులో పెడుతామన్నారు సీఎం జగన్. అక్టోబర్ నెలలో ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చడం జరుగుతోందన్నారు. అవినీతి తావు లేకుండా…కార్యక్రమాలు జరుగుతున్నాయంటే..గ్రామ వాలంటీర్ల, గ్రామ సెక్రటేరియట్ కృషి ఎంతుందో అర్ధం చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు.
Read More : 72 గంటల్లో పెన్షన్, రేషన్ కార్డు – సీఎం జగన్