ఆయనే రియల్ హీరో: టీడీపీ తరుపున హీరో నిఖిల్ ప్రచారం

  • Publish Date - April 5, 2019 / 02:29 AM IST

ఎన్నికల ప్రచారం వేళ సినిమా హీరోలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హ్యాపీడేస్, కార్తికేయ సినిమాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న సినీ నటుడు హీరో నిఖిల్ టీడీపీ డోన్ అభ్యర్థి కేఈ ప్రతాప్ తరఫున ప్రచారం చేశారు. రోడ్‌షోలో పాల్గొన్న నిఖిల్.. కేఈ ప్రతాప్ గారు తనకు మంచి ఆప్తుడు అని, దాదాపుగా 5 ఏళ్లుగా తెలుసునని, ఇక్కడ చాలా అభివృద్ది చేశాడని, అభివృద్ధి చేసేవాళ్లకే ఓటు వేయాలని నిఖిల్ అన్నారు. సినిమా హీరోలాగా డోన్‌కు రాలేదని, మంచి చేసే పార్టీనే మళ్లీ గెలిపించాలని కోరేందుకు వచ్చినట్లు నిఖిల్ చెప్పారు. కేఈ ప్రతాప్‌ను గెలిపించాక మళ్లీ వస్తానని నిఖిల్ అన్నారు. 

ఇక్కడి రోడ్లని చూస్తుంటేనే ఆయన ఈ ప్రాంతంకు ఎంత కృషి చేశారో అర్థం అవుతుందని, నేను రిల్ హీరోని అయితే కేఈ ప్రతాప్ రియల్ హీరో అని ఆయ్న అన్నారు.. ఈసారి అందరి ఓటుని వినియోగించుకోండి.. మన ప్రభుత్వాన్ని మళ్ళీ మనం అనాదరం కలిసి గెలిపించుకుందాం.. ప్రతాప్ గెలుపు తరువాత మళ్ళీ ఇక్కడికి వస్తాను అని నిఖిల్ అన్నారు. మన టీడీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు, దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని నిఖిల్ చెప్పారు.

మంచి పనులు చేసి ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తేవాలని నిఖిల్ కోరారు. ఇదిలా ఉంటే గతంలో నిఖిల్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని పలుమార్లు చెప్పారు.