చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు: వైఎస్ జగన్

  • Publish Date - April 20, 2019 / 04:54 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు 69వ పుట్టిన రోజును టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు పెద్దఎత్తున జరుపుతున్నారు. ప్రధాని మోడీ కూడా ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.