మరో ట్విస్ట్ : NIA కి కోడికత్తి కేసు

గన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

  • Published By: veegamteam ,Published On : January 4, 2019 / 08:17 AM IST
మరో ట్విస్ట్ : NIA కి కోడికత్తి కేసు

Updated On : January 4, 2019 / 8:17 AM IST

గన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

విశాఖ : జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. NIA యాక్ట్ ప్రకారం కేసును NIAకు బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారు అవుతాయని పిటిషనర్ వాదించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నిర్ణయం చెప్పాలని గతంలోనే ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పునిస్తూ జగన్‌పై దాడి కేసును NIAకు అప్పగించింది.