ఓటేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు : చంద్రబాబుకి వైసీపీ ప్రశ్న

  • Publish Date - April 15, 2019 / 12:43 PM IST

AP ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మొద్దని..YCP పార్టీదే విజయమని ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. బాబుకు ఓటమి భయం పట్టుకుందని.. టీడీపీ ఓడిపోతుందని చెప్పిన విజయసాయి వైసీపీ విజయసంకేతాలు ఎగురవేస్తుందని ఇంటెలిజెన్స్ సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీ సీఈసీని వైసీపీ బృందం కలిసింది. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

వైసీపీ కార్యకర్తలను సూరి అనే వ్యక్తి హింసిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో 80 శాతం ఓటింగ్ నమోదైందని గుర్తు చేశారు. 130 స్థానాలు గెలుస్తామని చెబుతున్న బాబు.. 30శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకో లేదని భిన్నంగా చెబుతున్నారని తెలిపారు. ఒక్కొక్క రకంగా బాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీవీ ప్యాట్‌లు పని చేయకపోతే.. ఏప్రిల్ 11న ఉదయం ఓటు వేసిన బాబు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేశారని.. వైసీపీని గెలుచుకోవాలనే తపన ప్రజల్లో వ్యక్తం అయ్యిందన్నారు. దీనిని అపహస్యం చేయవద్దని జాతీయ పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు