Trump and Jinping
Donald Trump: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పలు సర్వేల్లో ఇరువురు మధ్య స్వల్ప తేడానే ఉండటంతో విజయాన్ని చేజిక్కించుకోవాలని అభ్యర్ధులిద్దరూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తాజాగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ఇటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తైవాన్ భూభాగంపై చైనా దాడికి యత్నిస్తే 150 శాతం నుంచి 200 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ వెల్లడించారు. తైవాన్ పై చైనా దిగ్భందనానికి వ్యతిరేకంగా సైనిక శక్తిని ఉపయోగిస్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తనను గౌరవిస్తున్నందున సమస్య అక్కడి వరకు రాదని ట్రంప్ చెప్పుకొచ్చారు.
Also Read: టార్గెట్ క్లియర్..! ఇక విధ్వంసమేనా? ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ రెడీ..!
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో నాకు చాలా మంచి సంబంధం ఉంది. నేను సైనిక శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను నన్ను గౌరవిస్తాడని ట్రంప్ అన్నారు. ఇదిలాఉంటే.. ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా పట్ల సుంకాల విధింపు విషయంలో దూకుడుగా వ్యవహరించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను కదిలించే స్థాయిలో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. మరోవైపు యుక్రెయిన్, రష్యా యుద్ధంపైనా ట్రంప్ స్పందించారు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉండిఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ పై దాడిని ప్రారంభించేవాడు కాదని అన్నారు. వ్లాదిమిర్ పుతిన్ తో నాకు మంచి సంబంధం ఉంది. నేను గతంలో పుతిన్ కు చెప్పాను.. మీరు యుక్రెయిన్ పై దాడికి వెళితే అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని చెప్పానని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read: Yahya Sinwar: ఇజ్రాయెల్ దాడిలో చనిపోయే ముందు యాహ్యా సిన్వార్ ఏం చేశాడో తెలుసా.. డ్రోన్ వీడియో వైరల్
ఇదిలాఉంటే.. ముంబయిలో తైవాన్ కు చెందిన తైపెయ్ ఆర్థిక, సాంస్కృతిక మండలి (టీఈసీసీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై చైనా స్పందించింది. భారత్ కు దౌత్యపరమైన నిరసనను తెలియజేసింది. ప్రపంచంలో ఒకే చైనా ఉంది. తైవాన్ మా దేశంలో విడదీయరాని భాగం అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. తమతో దౌత్య సంబంధాలున్న దేశాలు తైవాన్ తో అధికారికంగా సంబంధాలు నెరపడాన్ని, సంప్రదింపులు జరపడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా స్పష్టం చేసింది.
Republican presidential candidate Donald Trump said he would impose additional tariffs on #China if China were to “go into #Taiwan,” the Wall Street Journal reported. https://t.co/muSDebjnxH
— William Yang (@WilliamYang120) October 19, 2024