టార్గెట్ క్లియర్..! ఇక విధ్వంసమేనా? ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ రెడీ..!

అగ్ర రాజ్యం ఒత్తిడితోనే ఇజ్రాయెల్ ఇలాంటి నిర్ణయం తీసుకుందా?

టార్గెట్ క్లియర్..! ఇక విధ్వంసమేనా? ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ రెడీ..!

Israel Iran War (Photo Credit : Google)

Updated On : October 18, 2024 / 11:00 PM IST

Israel Iran War : మౌనం కొన్నిసార్లు చావు కంటే భయంకరం. ఇజ్రాయెల్ మౌనం.. ప్రపంచాన్ని భయపెట్టింది. దాడి చేసే బలం, బలగం ఉన్నా.. ఇరాన్ క్షిపణి దాడులపై ఇజ్రాయెల్ మౌనంగానే కనిపించింది. ఇన్ని రోజులు సైలెన్స్ తర్వాత ఇరాన్ పై దాడులకు ఇజ్రాయెల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. టార్గెట్ ఫిక్స్ చేసింది. టైమ్ చెప్పు చాలు ఇక విధ్వంసమే అని ప్రధాని ముందు ఒక లిస్ట్ పెట్టింది ఇజ్రాయెల్ సైన్యం. ఇంతకీ ఆ దేశం టార్గెట్ ఏంటి? అమెరికా దూకుడుకు అర్థం ఏంటి? ఇకపై విధ్వంసం ఏ రేంజ్ లో ఉండబోతోంది?

బలవంతుడి మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచం ఎక్స్ పీరియన్స్ చేసింది ఈ 20 రోజులు. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. వెంటనే కౌంటర్ ఇచ్చి ప్రతీకార దాడులు చేసే సత్తా ఉన్నా.. ఇజ్రాయెల్ ఇన్ని రోజులు మౌనంగానే ఉంది. ఇరాన్ తప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. ఏం చేయబోతోంది? ఎలాంటి దాడులకు ప్లాన్ చేసింది? అన్నది ప్రతీ ఒక్కరిని టెన్షన్ పెట్టింది.

చమురు క్షేత్రాలు, అణు స్థావరాలను వదిలేది లేదు అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. మూడు వారాలు దాటినా మౌనం వీడలేదు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ విఫలం కావడం, అమెరికా స్వయంగా రంగంలోకి దిగడం, థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ కు పంపించడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది.. విధ్వంస రచన చేస్తోందని ప్రపంచమంతా భయపడింది. ఫైనల్ గా ఇరాన్ పై దాడులకు దిగేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. టార్గెట్ ఇరాన్ అంటూ ప్రధాని ముందు ఇజ్రాయెల్ సైన్యం పెట్టిన లిస్ట్.. ఇప్పుడు పశ్చిమాసియాను, ప్రపంచాన్ని మరింత టెన్షన్ పెడుతోంది.

చమురు క్షేత్రాలు, అణు స్థావరాలను కూడా వదలమని పదే పదే చెప్పిన ఇజ్రాయెల్ ఇప్పుడు వాటి జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యింది. అగ్ర రాజ్యం ఒత్తిడితోనే ఇజ్రాయెల్ ఇలాంటి నిర్ణయం తీసుకుందా? ఇజ్రాయెల్ అదే మాట మీద నిలబడుతుందా? ఈ నిర్ణయం వెనుక రాజకీయం ఉందా? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇకపై ఏ మలుపు తీసుకోబోతోంది? ప్రపంచాన్ని భయపెడుతున్నది ఏంటి?

చమురు క్షేత్రాలు, అణు స్థావరాలు.. నో టార్గెట్.. ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ మార్చుకుంది.. చివరి క్షణంలో లక్ష్యాలు మారొచ్చు అంటే.. దాని అర్థమేంటి? ఇజ్రాయెల్ ఎలాంటి ఆయుధాలు సిద్ధం చేసింది? చమురు క్షేత్రాలు, అణు స్థావరాలపైన కూడా దాడులు చేస్తామని, ఇరాన్ ను వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది.

ఇజ్రాయెల్ దూకుడుతో అలర్ట్ అయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. అక్టోబర్ 8న నెతన్యాహుతో ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడారు. దాడులకు సంబంధించి ప్రతీ సమాచారం తమతో పంచుకోవాలని కోరిన బైడెన్.. అణు స్థావరాల మీద అటాక్ చేయొద్దని సూచించారు. దీంతో ప్రస్తుతానికి చమురు క్షేత్రాలు, అణుస్థావరాల జోలికి వెళ్లొద్దని ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. అయితే దేశం కోసం చివరి నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్ పెద్దలు చెబుతున్న మాటలు.. మరింత టెన్షన్ పెడుతున్నాయి.

Also Read : ముంబైని వణికిస్తున్న ఒకేఒక్క పేరు లారెన్స్ బిష్ణోయ్..! మరో దావూద్‌లా మారుతున్నాడా?