ముంబైని వణికిస్తున్న ఒకేఒక్క పేరు లారెన్స్ బిష్ణోయ్..! మరో దావూద్‌లా మారుతున్నాడా?
అందరిలో దావూద్ పేరు ముంబై ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అలా దావూద్ లా ఎదుగుతూ మరో దావూద్ అనిపిస్తున్నాడు లారెన్స్ బిష్ణోయ్.

Lawrence Bishnoi (Photo Credit : Google)
Lawrence Bishnoi : మాఫియా కోరల్లోంచి బయటపడి మెల్లిగా ఏదోలా బతికేస్తున్న ముంబైని.. ఏలెద్దామని ఒకరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడో జైల్లో ఉండి ఇక్కడ చక్రం తిప్పుతూ అండర్ వరల్డ్ కు నయా డాన్ గా మారాడు. మాఫియా లేదు ఇక రాదని ఊపిరి పీల్చుకుంటున్న ముంబైకి మళ్లీ భయాన్ని పరిచయం చేస్తున్నాడు. మహా నగరాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క పేరు లారెన్స్ బిష్ణోయ్. దావూద్ కు, బిష్ణోయ్ కు పోలికలు ఏంటి? బాలీవుడ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
దేశ ఆర్థిక రాజధాని ముంబై.. కలలకు, అవకాశాలకు, ఆశలకు, ఆశయాలకు కూడా ఇదే రాజధాని. అలాంటి ముంబైకి అండర్ వరల్డ్ రూపంలో చీకటి కోణం ఉంది. ఆధిపత్య పోరుకు, రక్తపాతానికి ఈ మహానగరం చాలాసార్లు మౌనసాక్షిగా మారింది. 1970 నుంచి దాదాపు 30 ఏళ్లు అండర్ వరల్డ్ ఆడించినట్లు ముంబై ఆడింది. కరీం లాలా నుంచి వరదరాజన్ ముదలియార్.. దావూద్ ఇబ్రహిం, చోటా రాజన్, అరుణ్ గౌలి, అమర్ నాయక్.. ఇలా ఎంతోమంది అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏలారు. అందరిలో దావూద్ పేరు ముంబై ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అలా దావూద్ లా ఎదుగుతూ మరో దావూద్ అనిపిస్తున్నాడు లారెన్స్ బిష్ణోయ్.
ఇంతకీ ఎవరీ లారెన్స్ బిష్ణోయ్. పంజాబ్ లోని మారుమూల గ్రామంలో పుట్టిన ఈ గ్యాంగ్ స్టర్ నేర ప్రపంచానికి రాజులా ఎలా మారాడు. సల్మాన్ ఖాన్ కు సాయం చేసే వాళ్లు ఎవరైనా చంపేస్తామని ఓపెన్ గా వార్నింగ్ ఇస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? జైల్లోనే ఉంటూ ఈ దందాలన్నీ ఎలా నడిపిస్తున్నాడు?
లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ లోని సబర్మతీ జైల్లో ఉన్నాడు. జైలు నుంచే ముఠాను ఆపరేట్ చేస్తున్నాడు. రాజకీయ నాయకులనే కాదు బాలీవుడ్ ను కూడా ఒంటి చేత్తో వణికిస్తున్నాడు. ఇంటర్ చదివిన బిష్ణోయ్ పంజాబ్ యూనివర్సిటీ డీఏవీ కాలేజీలో చేరి అక్కడే నేషనల్ రేంజ్ అథ్లెట్ గా, స్టూడెంట్ లీడర్ గా ఎదిగాడు. లా పూర్తి చేశాక గోల్డీబ్రార్ అనే గ్యాంగ్ స్టర్ తో పరిచయం పెంచుకుని సంఘ వ్యతిరేక శక్తిగా మారాడు. గ్యాంగ్ వార్ లో ప్రియురాలు సజీవ దహనం కావడంతో హార్డ్ కోర్ క్రిమినల్ గా మారాడు.
Also Read : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు బహిరంగ లేఖ