Somy Ali: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కి సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు బహిరంగ లేఖ

జైలు నుంచి జూమ్‌ కాల్స్ చేస్తారని తనకు తెలిసిందని, తాను కూడా బిష్ణోయ్‌తో మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పింది.

Somy Ali: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కి సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు బహిరంగ లేఖ

Updated On : October 17, 2024 / 7:54 PM IST

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కి బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సోమీ అలీ బహిరంగ లేఖ రాసింది. “మీరు జైలు నుంచి జూమ్ కాల్స్ చేయండి.. మీతో మాట్లాడతాను” అని అందులో చెప్పింది. సల్మాన్‌ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్‌ బెదిరింపులకు పాల్పడతాడన్న విషయం తెలిసిందే. గుజరాత్ జైల్లో బిష్ణోయ్ ఉన్నాడు.

సల్మాన్‌తో సన్నిహితంగా ఉంటున్న ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీని లారెన్స్‌ గ్యాంగ్‌ హత్య చేసింది. ఈ సమయంలో సోమీ అలీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ మెసేజ్‌ పెట్టింది. లారెన్స్ బిష్ణోయ్.. జైలు నుంచి జూమ్‌ కాల్స్ చేస్తారని తనకు తెలిసిందని, తాను కూడా బిష్ణోయ్‌తో మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పింది.

బిష్ణోయ్‌ను ఎలా సంప్రదించాలంటూ మెసేజ్‌లో అతడినే అడిగింది. తనకు రాజస్థాన్‌ అత్యంత ఇష్టమైన ప్రదేశమని, మొదట బిష్ణోయ్‌తో జూమ్‌ కాల్‌లో మాట్లాడి, ఆ తర్వాత అక్కడికి వెళ్లాలని భావిస్తున్నానని చెప్పింది. తాను ఇలా అంటున్నది బిష్ణోయ్‌ మంచికోసమేనని తెలిపింది.

బిష్ణోయ్‌ మొబైల్‌ నంబర్ ఇస్తే బాగుంటుందని చెప్పింది. ఈ సందర్భంగా బిష్ణోయ్ ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది. కాగా, గతంలో సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్న సోమీ అలీ ఆ తర్వాత అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అమ్మాయిలను సల్మాన్ ఖాన్ కొట్టేవాడని చెప్పింది. అనంతరం ఆ పోస్టుని డిలేట్ చేసింది.

Israeli Strike : ఉత్తర గాజాలో స్కూల్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. 28మంది మృతి..!