Viral Video : విమానంలో సప్లై చేసిన భోజనంలో పాము తల

ఒళ్ళు గగుర్పొడిచే   ఘటన ఒకటి గాల్లో ఎగురతున్న విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ఫ్లైట్   అటెండెంట్ భోజనం చేస్తుండగా అందులో పాము తల కనిపించింది.

Snake Head In Meals

Viral Video : ఒళ్ళు గగుర్పొడిచే   ఘటన ఒకటి గాల్లో ఎగురతున్న విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ఫ్లైట్   అటెండెంట్ భోజనం చేస్తుండగా అందులో పాము తల కనిపించింది. అంతే ఒక్కసారిగా హడలిపోయి… గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జులై 21న టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డ్యూసెల్ డార్ఫ్ కు వెళుతున్న సన్ ఎక్స్ ప్రెస్ విమానంలో ఈ దిగ్భ్రాంతికర  సంఘటన చోటు చేసుకుంది. క్యాబిన్ సిబ్బంది భోజనం చేస్తున్నారు.  అందులో ఒక అటెండెంట్ సగం భోజనం పూర్తయిన తర్వాత బంగాళదుంపలు, కూరగాయల మధ్య తెగిపడిన పాము తలను గుర్తించాడు. అంతే భయంతో కెవ్వుమని కేక వేసి వణికిపోయాడు.


ట్విట్టర్ లోషేర్ చేసిన వీడియోలో.. ఫుడ్ ట్రే  మధ్యలో పాము తల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై విమానయాన సంస్ధ స్పందించింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు చేపట్టింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్ సంస్ధతో ఒప్పందాన్ని హోల్డ్ లో పెట్టినట్లు తెలిపింది.

Also Read : Rahul Gandhi : ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి ? మోదీకి ప్రశ్నలు సంధించిన రాహుల్