YouTuber Arrested: యూట్యూబర్ తిక్క కుదిరింది..! మూడ్నెళ్ల క్రితం బర్త్ డే వేడుకల వీడియో వైరల్.. అరెస్టు చేసిన పోలీసులు
ప్రిన్స్ దీక్షిత్ అనే యూట్యూబర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్ నెలలో తన బర్త్ డే వేడుకల్లో దీక్షిత్, అతని స్నేహితులు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. గురువారం పోలీసులు దీక్షిత్‌ను అరెస్టు చేశారు. అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
- Harish Thanniru
- Updated on- March 17, 2023 / 05:53 PM IST
Prince-Dixit-Virail-Video
YouTuber Arrested: బర్త్ డే వేడుకలు అంటే చాలు.. చాలామంది యువత రోడ్లపై వాహనాలతో చక్కర్లు కొడుతూ, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైనే బర్త్ డే కేక్‌లు కట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇదే తరహాలో ఓ యూట్యూబర్ తన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.. ఇంకేముంది రెండు నెలల తరువాత పోలీసులు కంట్లో పడటంతో నిబంధనలు అతిక్రమించినందుకు యూట్యూబర్ ను అరెస్టు చేశారు.
ప్రిన్స్ దీక్షిత్ అనే యూట్యూబర్ రాజధాని నగరంలో నివసిస్తున్నాడు. దీక్షిత్ గతేడాది డిసెంబర్ 16న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. పుట్టిన రోజు వేడుకలంటే ఫుల్ ఎంజాయ్ ఉండాలనుకున్నాడోఏమో.. తన స్నేహితులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ఓపెన్ టాప్ కారుపై నగర వీధుల్లో సందడి చేశాడు. అక్షరధామ్ నుంచి ఘజియాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై ఓపెన్ టాప్ కారులో పైకెక్కి, కారును వేగంగా పోనిస్తూ పలు రకాల స్టంట్స్‌తో హల్‌చల్ చేశారు. అంతటితో ఆగకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ये वीडियो गाजियाबाद का बताया जा रहा है
बीच सड़क पर दारू,असलहा, स्टंट और फुल टशन। बाकी तो छोड़िए कार पर लगा भाजपा का झंडा देखिए
अब सत्ताधारी ही कानून की धज्जियां उड़ाकर उसका वीडियो बनाकर मजाक उड़ा रहे हैं pic.twitter.com/zm5WbVrHI4
— Nigar Parveen (@NigarNawab) March 15, 2023
ఈ వీడియో కాస్త వైరల్ కావటంతో నిబంధనలకు విరుద్ధంగా నగర వీధుల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు యూట్యూబర్ ప్రిన్స్ దీక్షిత్‌ను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దీక్షిత్ తో బర్త్ డే వేడుకల్లో పాల్గొని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఇతరులకోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
