Viral Video: దుబాయ్ ‘బుర్జ్ అల్ అరబ్’ బిల్డింగ్‌పై తొలిసారి ల్యాండ్ అయిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

దుబాయ్‌లోనే ఉన్న మరో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ అల్ అరబ్. దీని ఎత్తు 280 మీటర్లు (920 అడుగులు). ఇంత ఎత్తైన బిల్డింగులపై సాధారణంగా హెలికాప్టర్లు మాత్రమే ల్యాండ్ అవుతుంటాయి. విమానాలు ల్యాండ్ అవ్వడం వీలు కాదు. కానీ, బుర్జ్ అల్ అరబ్ బిల్డింగ్‌పై తాజాగా ఒక విమానం ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది.

Viral Video: దుబాయ్ ‘బుర్జ్ అల్ అరబ్’ బిల్డింగ్‌పై తొలిసారి ల్యాండ్ అయిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Viral Video: దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలిఫా బిల్డింగ్ అక్కడే ఉంది. దుబాయ్‌లోనే ఉన్న మరో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ అల్ అరబ్. దీని ఎత్తు 280 మీటర్లు (920 అడుగులు). ఇంత ఎత్తైన బిల్డింగులపై సాధారణంగా హెలికాప్టర్లు మాత్రమే ల్యాండ్ అవుతుంటాయి.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

విమానాలు ల్యాండ్ అవ్వడం వీలు కాదు. కానీ, బుర్జ్ అల్ అరబ్ బిల్డింగ్‌పై తాజాగా ఒక విమానం ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది. దీనిపై విమానం ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. పోలాండ్‌కు చెందిన ఎయిర్ రేస్ చాలెంజర్ క్లాస్ వరల్డ్ ఛాంపియన్ అయిన ల్యుక్ సెపిలా ఈ అరుదైన ఘనత సాధించాడు. బిల్డింగ్‌పై నిర్మించిన హెలిప్యాడ్‌పై విమానాన్ని సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ చేశాడు. బుర్జ్ అల్ అరబ్ హోటల్ హెలిప్యాడ్‌పై ప్రత్యేకంగా తయారు చేసిన విమానాన్ని ల్యూక్ ల్యాండ్ చేశాడు. ఈ హెలిప్యాడ్ 56వ అంతస్థులో, 212 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ హెలిప్యాడ్ 27 మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. ఇంత తక్కువ స్థలం ఉన్న చోట విమానం ల్యాండ్ చేయడం కష్టం.

Bandi Sanjay: పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలి.. కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతోంది: బండి సంజయ్

అయినప్పటికీ ల్యూక్ దీన్ని విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. అంతేకాదు.. తర్వాత అక్కడి నుంచి విమానాన్ని టేకాఫ్ కూడా చేశాడు. ఇది ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బిల్డింగ్ నుంచి విమానం పొగలు కక్కుతూ కిందికి దూసుకెళ్లింది. కొంతదూరం వెళ్లాక తిరిగి సమాంతరంగా దూసుకెళ్లింది. ఈ స్టంట్ చేసేందుకు అతడు దాదాపు రెండేళ్లు సిద్ధమయ్యాడు. దీనికోసం ఇంతకుముందు 650 సార్లు ఇలా విమానాన్ని ల్యాండ్ చేసినట్లు దుబాయ్ మీడియా తెలిపింది. ల్యూక్ సెపిలాకు విమానాలు నడపడంలో మంచి పేరుంది. రెడ్ బుల్ ఎయిర్ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు.