Viral Video : షాపులోకి దూసుకొచ్చిన కారు-వైరల్ వీడియో

అమెరికాలోని టెంపే నగరంలో ఓ షాపులోకి కారు దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఆ షాపులో పని చేస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలను అక్కడి పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయటంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Car Crash In United States

Viral Video :  అమెరికాలోని టెంపే నగరంలో ఓ షాపులోకి కారు దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఆ షాపులో పని చేస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలను అక్కడి పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయటంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టెంపే నగరంలోని ఒక షాపు ముందు తెల్లరంగు కారు ఒకటి వచ్చి ఆగుతోంది. ఆసమయంలో కారు బ్రేక్ వేయాల్సిన డ్రైవర్ ఎక్స్ లైటర్ పై కాలు వేసి తొక్కాడు. అంతే కారు అద్దాలు పగలకొట్టుకుంటూ లోపలకు వచ్చేసింది. షాపులో మాట్లాడుకుంటున్న ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు.

షాపులో కొన్ని వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న టెంపే నగర పోలీసులు కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. కాగా ఈ ప్రమాదంలో షాపులోని కొన్ని ర్యాక్ లు కూడా ధ్వంసం అయ్యాయని యజమాని తెలిపారు. షాపు రిపేరు నిమిత్తం కొన్ని రోజులపాటు మూసి వేస్తున్నట్లు తెలిపారు.