Viral Video: “నా సూపర్ మార్కెట్ నుంచి ఏది కావాలన్నా ఫ్రీగా తీసుకెళ్లండి”.. అని చెప్పిన యజమాని

"నా సూపర్ మార్కెట్ నుంచి ఏది కావాలంటే అది ఫ్రీగా తీసుకెళ్లండి.. నేను ఇప్పటికే ఈ షాపు ద్వారా కావాల్సినంత సంపాదించాను" అని ఆ సూపర్ మార్కెట్ యజమాని అన్నారు. భూకంపం నేపథ్యంలో ఆ సూపర్ మార్కెట్ యజమాని చూపిన దాతృత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Viral Video: టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన భూకంపాల ధాటికి లక్షలాది మంది ప్రజలు ఆహారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. భూకంపం ధాటికి 46,000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు పలు దేశాలు సాయం చేస్తున్నాయి. భూకంపం సంభవించిన సమయంలో టర్కీలో ఓ సూపర్ మార్కెట్ యజమాని తమ వద్ద ఉన్న సరుకులన్నింటినీ బాధితులకు ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. “నా సూపర్ మార్కెట్ నుంచి ఏది కావాలంటే అది ఫ్రీగా తీసుకెళ్లండి.. నేను ఇప్పటికే ఈ షాపు ద్వారా కావాల్సినంత సంపాదించాను” అని ఆ సూపర్ మార్కెట్ యజమాని అన్నారు. భూకంపం నేపథ్యంలో ఆ సూపర్ మార్కెట్ యజమాని చూపిన దాతృత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అతడిని, అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కామెంట్లు చేస్తున్నారు. సూపర్ మార్కెట్లో ఉన్న సరుకులను స్వచ్ఛంద సంస్థ వారు, స్థానికులు తీసుకెళ్తుండడం ఈ వీడియోలో చూడవచ్చు. కాగా, భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు నేటమట్టం అయ్యాయి. ఇప్పటికే చాలా మంది మృత్యువుతో పోరాడుతున్నారు.


Biden’s Surprise Kyiv Visit: ఉక్రెయిన్‌లో బైడెన్‌ సర్‌ప్రైజ్‌ విజిట్.. జెలెన్ స్కీతో చర్చలు

ట్రెండింగ్ వార్తలు