Two Headed Snake : ఎలుక పిల్లలను ఆరగించిన రెండు తలల పాము.. వీడియో వైరల్‌

రెండు తలలు పాము, రెండు ఎలుక పిల్లలను ఒకేసారి తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా రెండు తలల పాములు పుట్టిన కొద్దీ రోజులకు చనిపోతాయి. వీటిలో కొన్ని మాత్రం చాలా రోజుల వరకు జీవిస్తాయి. జన్యుపరమైన లోపాల వలన రెండు తలలతో జన్మిస్తాయి. కొన్నిటిలో ఒక తల మాత్రమే పనిచేస్తుంది.. మరికొన్నింటిలో మాత్రం రెండు తలలు పనిచేస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో రెండు తలలు పనిచేస్తున్న పాము రెండు ఎలుక పిల్లలను ఒకేసారి తింటుంది.

Two Headed Snake

Two Headed Snake : పామును చూస్తే చాలామంది భయపడుతుంటారు.. పాము కనిపిస్తే పరుగు లంకించుకుంటారు. మరికొందరు మాత్రం పామును పట్టుకొని ఆటలాడుతారు. దానిని బందించి ఇతర ప్రాంతాల్లో వదిలేస్తారు.. ఇలా చేయడం రిస్క్.. అయినా వారు పాములను రక్షించడానికి ఈ విధంగా చేస్తుంటారు.

అయితే ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యే పాముల వీడియోల్లో కొన్ని ఒళ్ళుగగ్గుర్పొడిచేలా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా అలాంటిదే.. ఓ రెండు తలల పాము రెండు ఎలుక పిల్లలను పట్టుకొని తింటుంది. దీనికి సంబందించిన వీడియోని వ్లాగర్ బ్రియాన్ బార్జిక్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

వీడియోలో రెండు తలలున్న బెన్‌ అండ్‌ జెర్రీ అనే పాము మాటువేసి ఎలుకను పట్టుకొని అమాంతం మింగేసి ఆకలి తీర్చుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘రెండు తలల పాము కావాలి. ఎక్కడ దొరుకుతుంది. ఇంతకుముందెన్నడూ రెండు తలల పామును నేను చూసిందే లేదు’ అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.