Viral Video : అది ఆటోనా…బస్సా…సెవెన్ సీటర్ ఆటోలో 27 మంది…

యూపీలోని ఒక ఆటో డ్రైవర్ ఏకంగా తన సెవెన్ సీటర్ ఆటోలో చిన్నాపెద్దా అందరినీ కలిపి 27 మందిని ఎక్కించుకుని వెళుతుండగా పోలీసులు ఆపి షాకయ్యారు. 

Viral Video

Viral Video :  సాధారణంగా సెవెన్   సీటర్ షేరింగ్ ఆటోల్లో ఓ పది మందిని లేదా మరో ఇద్దరిని కలిపి 12 మందిని ఎక్కించుకిని డ్రైవర్లు వెళుతుంటారు.   కానీ యూపీలోని ఒక ఆటో డ్రైవర్ ఏకంగా తన సెవెన్ సీటర్ ఆటోలో చిన్నాపెద్దా అందరినీ కలిపి 27 మందిని ఎక్కించుకుని వెళుతుండగా పోలీసులు ఆపి షాకయ్యారు.  ఇందుకు సంబంధించినవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ బింద్ కొత్వాలి ప్రాంతంలో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా అటు వైపు స్పీడ్‌గా  వస్తున్న ఒక ఆటోను ఆపారు. ఆటో ఓవర్ లోడ్ లో ఉందని గ్రహించారు.  ఆశ్చర్య  పోయిన పోలీసులు ఆటోలో వారినందరినీ ఒక్కోక్కరిగా కిందకు రమ్మన్నారు.

చిన్నపిల్లలతో సహా 27 మందికి   ఆటోలోంచి   కిందకు దిగే సరికి షాకయ్యారు. అనంతరం డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. ఈవీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్ల ఇస్తున్నారు.