Video Of Girls’ Insta Reels: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర మందిరం పరిసరాల్లో కొందరు అమ్మాయిలు బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. పవిత్ర మందిరం వద్ద ఆ అమ్మాయిలు ప్రదర్శించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంప్రదాయాలు, ఆచారాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం సరికాదని హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఓ అమ్మాయి లింగం వద్ద జలాభిషేకం చేస్తున్నట్లు కూడా వీడియో తీసుకోవడం గమనార్హం. దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆ ఘటనపై విచారణ జరపాలని ఇప్పటికే కలెక్టరు, ఎస్సీకి సూచించానని అన్నారు. మతపర నమ్మకాలతో ఆడుకోవడం సరికాదని చెప్పారు. ఆ అమ్మాయిల తీరుపై ఉజ్జయిని మహాకాళ్ మందిరం అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఇటువంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
महाकाल मंदिर में लड़कियों ने बनाए अश्लील वीडियो, इंटरनेट पर वायरल होते ही भड़के पुजारी pic.twitter.com/vaDJFpJHzY
— News Track (@newstracklive) October 18, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..