viral video
Viral Video : కొద్ది రోజుల క్రితం విద్యుత్ శాఖలో ఒక మహిళ లైన్ ఉమెన్‌గా సెలక్ట్ అయి, ఆమె అవలీలగా కరెంట్ స్తంభాలు ఎక్కటం చూసి మనం గొప్పగా చెప్పుకున్నాము. కానీ ఒక మహిళ కరెంట్ స్తంభాన్ని పట్టుకుని దానిపై ఏరోబిక్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏ దేశంలో జరిగిందో తెలియదు కానీ నెక్స్ట్ లెవల్ స్కిల్స్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. బ్లాక్ డ్రస్ ధరించిన మహిళ తన హై హీల్స్ తీసి వీధి దీపం స్తంభాన్ని అవలీలలగా ఎక్కింది. అక్కడున్న ఐరన్ రాడ్ పట్టుకుని ఏరోబిక్స్ చేయటం ప్రారంభించింది.
ఈవీడియోకు ఇప్పటి వరకు కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. వాటితో పాటు నెటిజన్ల రియాక్షన్ కూడా ఉంది. ఆమె రిస్క్ చేస్తోందని కొందరు వ్యాఖ్యానించగా… మహిళ ధైర్య సాహాసాలు, శక్తియుక్తులను కొందరు ప్రశంసించారు.
Amazing Skills and Strength! pic.twitter.com/AG9w7y1EQA
— Next Level Skills (@SkillsLevel) August 20, 2022