miracle baby : టర్కీ భూకంపం ఆ తల్లి, బిడ్డల్ని విడదీసిన.. 54 రోజుల్లో విధి వారిని తిరిగి కలిపింది..

టర్కీ భూకంపం అక్కడి ప్రజల్ని కోలుకోలేకుండా చేసింది. చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరులా చెదిరిపోయారు. అయితే ఈ ఘటనలో ఓ పసిపాప తన తల్లికి దూరమైంది. 54 రోజుల నిరీక్షణ అనంతరం ఆ చిన్నారిని తల్లి వద్దకు చేర్చింది అక్కడి ప్రభుత్వం. వారిద్దరూ ఒక్కటైన వీడియో ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తోంది.

miracle baby : టర్కీలో (Turkey) భారీ భూకంపం (earthquake ఎన్నో కుటుంబాల్ని కకావికలం చేసింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న ఓ పసిపాపను కాపాడేందుకు అక్కడి రెస్క్యూ టీం విపరీతంగా శ్రమించింది. 128 గంటల్లో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. అయితే ఈ ఘటనలో మొదట అంతా ఆ చిన్నారి తల్లి చనిపోయింది అనుకున్నారు. కానీ ఆమె ప్రాణాలతో ఉందని తెలిసి సంతోషించారు. తిరిగి వారిద్దరిని ఒకటి చేయడానికి 54 రోజుల సమయం పట్టింది. తల్లీ, బిడ్డలు ఒకచోటకి చేరిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Turkey Earthquake 2023: టర్కీలో భూకంపం వల్ల భారీగా ఆర్థిక నష్టం.. ఎన్నికోట్ల నష్టం జరిగిందంటే..

ఫిబ్రవరి 6న టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 48వేల మంది వరకూ చనిపోయారు. వేలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. చెట్టుకి ఒకరు పుట్టకి ఒకరులా చెదిరిపోయారు. అలా ఓ తల్లి తన చిన్నారికి దూరమైంది. ఆ చిన్నారి శిథిలాల మధ్య చిక్కుకుపోవడంతో రెస్క్యూ టీం 128 గంటలపాటు శ్రమించి చివరకు ఆ పసిపాపను కాపాడారు. కొద్దిరోజులుగా నర్సుల పర్యవేక్షణలో ఉన్న ఆ చిన్నారికి “గిజెమ్ బెబెక్” (Gizem Bebek) అని కూడా పేరు పెట్టారు.

అయితే ఆ చిన్నారి తల్లి భూకంపంలో చనిపోయిందని అనుకున్నారు. కానీ ఆమె ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలియడంతో అందరూ సంతోషించారు. 54రోజుల నిరీక్షణ తర్వాత DNA పరీక్షల ద్వారా వారిద్దరినీ తల్లీబిడ్డలుగా నిర్ధారించారు. ఆ దేశ మంత్రి డెరియా యానిక్ ( Derya Yanık) స్వయంగా వెళ్లి ఆ చిన్నారిని తల్లికి అప్పగించారు. భవిష్యత్ లో ఆ తల్లీ బిడ్డలకు ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి డెరియో యానిక్ స్వయంగా ట్విట్టర్ లో పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Horse Found Alive : మహా అద్భుతం..! టర్కీలో భూకంపం వచ్చిన 21రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ గుర్రం, వీడియో వైరల్

మరోవైపు టర్కీ భూకంపంలో బాధితులు వేలల్లో ఉన్నారు. చాలామంది తమవారిని కోల్పోయారు. సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారారు.

 

ట్రెండింగ్ వార్తలు