Turkey Earthquake 2023: టర్కీలో భూకంపం వల్ల భారీగా ఆర్థిక నష్టం.. ఎన్నికోట్ల నష్టం జరిగిందంటే ..

టర్కీ అధ్యక్షుడు రెసిప్ తైయిప్ ఎర్డోగన్ ఆ దేశంలో భూకంపం వల్ల జరిగిన ఆర్థిక నష్టం వివరాలను వెల్లడించారు. భూకంపం వల్ల ధ్వంసమైన భవనాల సంఖ్య, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోల్పోయిన స్థాయిని పరిశీలిస్తే, పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.

Turkey Earthquake 2023: టర్కీలో భూకంపం వల్ల భారీగా ఆర్థిక నష్టం.. ఎన్నికోట్ల నష్టం జరిగిందంటే ..

Turkey

Updated On : March 21, 2023 / 8:24 AM IST

Turkey Earthquake 2023: టర్కీ, సిరియా సరిహద్దుల్లో గత నెల భారీ స్థాయిలో భూకంపం సంభవించిన విషయం విధితమే. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.4 గా నమోదైంది. ముఖ్యంగా టర్కీ (Turkey ) లో భూకంప ప్రభావం తీవ్రంగా ఉండటంతో అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 45వేల మంది మరణించారు. సహాయక చర్యల్లో శిథిలాల కింద నుంచి కుప్పలుగా మృతదేహాలు బయటపడ్డాయి. ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్థి నష్టం (property damage) కూడా జరిగింది. టర్కీ భూకంపం (Turkey Earthquake) దాటికి జరిగిన ఆస్తినష్టాన్ని అక్కడి ప్రభుత్వం అంచనావేసింది.

Turkey quake..Bina Tiwari : భూకంప బాధితులకు అండగా భారత్ అర్మీ డాక్టర్ బీనా తివారీ..!

ఆ దేశ అధ్యక్షుడు రెసిప్ తైయిప్ ఎర్డోగన్ టర్కీలో భూకంపం వల్ల జరిగిన ఆర్థిక నష్టం వివరాలను వెల్లడించారు. భారీ భూకంపం కారణంగా టర్కీ భూభాగంలో 104 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. భూకంపం వల్ల ధ్వంసమైన భవనాల సంఖ్య, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోల్పోయిన స్థాయిని పరిశీలిస్తే, పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.

 

గతనెల 6న టర్కీతో పాటు సిరియా ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం విధితమే. తెల్లవారు జాము సమయంలో భూమి కంపించడంతో ఇళ్లు నేలమట్టమై వేలాది మంది మరణించారు. టర్కీలోని పలు ప్రావిన్సుల్లో దాదాపు 45వేల మంది ఈ భూకంపం దాటికి మరణించినట్లు అక్కడి అధికారులు అంచనా వేశారు.