Turkey quake..Bina Tiwari : భూకంప బాధితులకు అండగా భారత్ అర్మీ డాక్టర్ బీనా తివారీ..!

భూకంప బాధితులకు అండగా భారత్ అర్మీ డాక్టర్ బీనా తివారీ అందిస్తున్న సేవలకు టర్కీ వాసులు కరిగిపోతున్నారు. బీనాను హృదయానికి హత్తుకుని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీనికి ఓ మచ్చు తునక ఆనంద్ మహేంద్రా షేర్ చేసిన ఫోటో..

Turkey quake..Bina Tiwari : భూకంప బాధితులకు అండగా భారత్ అర్మీ డాక్టర్ బీనా తివారీ..!

Turkey quake..Indian Army Doctor Bina Tiwari:  భూకంపంతో టర్కీ విలవిల్లాడిపోయింది. శవాల దిబ్బంగా మారిపోయింది. శిథిలాల్లో ప్రాణాలు కొట్టుకులాడుతున్నాయి. ప్రాణంతో బయటపడాలని తపనపడుతున్నాయి. శిథిలాలనుంచి ఎంతోమందిని రెస్క్యూటీమ్ సురక్షితంగా బయటకు తీస్తున్నారు. భూకంపంతో కకావికలంగా మారిపోయిన టర్కీకి నేనున్నానని భరోసా ఇచ్చింది భారతదేశం. భారత్ నుంచి 100మంది రిలీఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది టర్కీకి తరలివెళ్లింది. అక్కడ సహాయక చర్యల్ని కొనసాగిస్తోందీ బృందం. ఈ బృందంలో ట్రైనింగ్ డాగ్ స్క్వాడ్ కూడా వెళ్లింది. భారత వైమానికి దళానికి చెిందిన విమానం మందులు, డ్రిల్లింగ్ మిషన్లతో పాటు అవసరమైన పనిముట్లను తీసుకెళ్లింది.

టర్కీ భూకంప బాధితులకు భారత్ అందిస్తోన్న సాయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. భారత సైన్యాని(Indian Army)కి చెందిన డాక్టర్ బీనా తివారీ సేవలను కొనియాడతున్నారు టర్కీ బాధితులు. ఆమె నిరంతరం చేస్తున్న సహాయ సహకారాలకు ఆమె బాధితులకు అందిస్తున్ ప్రేమతో కూడిన సేవలతో ఆమె టర్కీ వాసుల మనస్సుల్ని గెలుచుకుంటున్నారు. వారి గుండెలకు హత్తుకుని అభినందిస్తున్నారు. డాక్టర్ బీనా తివారీ అందించే సేవలకు భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు. వైరల్‌గా మారిన బీనా తివారి ఫోటోలపై మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ‘‘The Global Image Of India’’అంటూ ప్రశంసించారు.

భారత సైన్యం(Indian Army) అందిస్తోన్న సహాయానికి కరిగిపోయిన ఓ టర్కీ మహిళ బీనా తివారీని ప్రేమగా ముద్దాడిన ఫోటో భారత్ గొప్పతనానికి మచ్చు తునకగా కనిపిస్తోంది. భారతీయ హృదయాలను కదిలించింది. టర్కీ వాసుల ప్రశంసలతో పాటు భారతీయ ప్రజల హృదయాలను తాకింది. మేజర్‌ బీనా తివారీ( Bina Tiwari). తుర్కియే(Turkey) వెళ్లిన వైద్య బృందంలో బీనా ఒక్కరే మహిళ. అక్కడ భారత్‌ తాత్కాలికంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. సేవలు ప్రారంభించిన 24 గంటల్లోనే ఆమె స్థానికుల మనసు గెలుచుకున్నారు.

దేహ్రాదూన్ కు చెందిన 28 ఏళ్ల మేజర్‌ బీనా తివారీ ఢిల్లీలోని ఆర్మీ కాలేజ్‌లో వైద్యవిద్య అభ్యసించారు. బీనా తాత తాత ఆర్మీలో సుబేదార్‌గా పనిచేశారు. బీనా తండ్రి 16 కుమావ్‌ పదాతిదళంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అలా ఆమె కుటుంబంలో చాలామంది దేశం కోసం ఆర్మీలో చేరారు. బీనా భర్త కూడా డాక్టరే. బీనా ప్రస్తుతం కల్నల్‌ యదువీర్‌ సింగ్‌ ఆధ్వర్యంలో అస్సాంలో విధులు నిర్వహిస్తున్నారు. 60 పారా ఫీల్డ్ ఆస్పత్రిలో ఆమె ఒక్కరే మహిళ కావటం విశేషమనే చెప్పాలి.

ఆమె భూకంప బాధితులకు సేవ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన భారత సైన్యం షేర్ చేసి.. ‘మేం జాగ్రత్తగా చూసుకుంటాం’ అని టర్కీ ప్రజలను ఉద్దేశించి భరోసా ఇచ్చింది. ఇలా ఆమె సేవలు నిరంతరం కొనసాగుతున్న క్రమంలో ఓ బాలికను కాపాడిన ఫోటోను ఆనంద్ మహీంద్రా ట్వీట్టర్ లో పోస్ట్ చేస్తూ..‘ప్రపంచంలోనే అదిపెద్ద సైన్యాల్లో మనది ఒకటి. సహాయకచర్యలు, పీస్‌కీపింగ్‌లో మనకు దశాబ్దాల అనుభవం ఉంది. ఇదీ భారత్‌ ఇమేజ్‌’ అని ప్రశంసలు కురిపించారు.

కాగా ఫిబ్రవరి 6(2023) టర్కీ, సిరియా దేశాలు భూకంపాలతో కంపించిపోయాయి. ఇప్పటి వరకు రెండు దేశాల్లోను 40,000మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల్లోంచి మృతదేహాలు బయటపడుతుండటంతో ఈ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఎన్నో వేల ప్రాణాలు ఇంకా శిథిలాల్లో చిక్కుకుని ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి అత్యంత దారుణ సమయంలో భారత సైన్యానికి ఆ దేశంతో విభేదాలు గుర్తుకురాలేదు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సామాన్యుల ఆర్తనాదాలే వినిపించాయి. కకావికలంగా మారిపోయిన శిథిలాలే కనిపించాయి. అలా భారత్ ఆర్మీ అందిస్తోన్న సేవలకు టర్కీ వాసులు గుండెలకు హత్తుకుని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా డాక్టర్ బీనా తివారీ చూపించే ప్రేమకు,ఆత్మీయతకు టర్కీ వాసులు కరిగిపోతున్నారు.