బ్రేకింగ్: తిరుపతి ఎయిర్ పోర్టు మూసివేత

  • Publish Date - January 29, 2019 / 03:42 PM IST

తిరుపతి : రేణిగుంట విమానాశ్రయ రన్ వే స్వల్పంగా దెబ్బతినటంతో మంగళవారం సాయంత్రం నుంచి ఎయిర్ పోర్టును అధికారులు అత్యవసరంగా మూసి వేశారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరుపతి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లాండింగ్ సమయంలో రన్ వే పై స్వల్పంగా పగుళ్ళు ఏర్పడటంతో ఎయిర్ పోర్టునుమూసి వేసి  అత్యవసరంగా బాగు చేసారు.  దీనివలన 7 విమానాల రాకపోకలలో ఆలస్యం ఏర్పడింది. విమాన రాకపోకలు నిలిపి వేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.