cross-border wedding : సరిహద్దుల మధ్య ఒకటైన జంట!

  • Publish Date - October 18, 2020 / 04:54 PM IST

2020 ఏడాదిలో కరోనా వైరస్ ప్రభావంతో అనేక పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి. చాలావరకు పెళ్లిళ్లు డిజిటల్ వేదికగా నిర్వహించారు. కానీ, ఓ జంట వినూత్న రీతిలో పెళ్లి బంధంతో ఒకటైంది. రెండు దేశాల సరిహద్దుల మధ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.



అమెరికా-కెనడా సరిహద్దుల్లో నది వంతెనపై జంట వివాహం చేసుకుంది. పడవల్లో వచ్చిన అతిధులు కొత్త దంపతులను దీవించారు. అమెరికా-కెనడా బోర్డర్‌లో ఉన్న వంతెనపై లిండ్సే క్లోవ్స్‌ అలెక్స్‌ లెకీలు పెళ్లి చేసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కెనడా సరిహద్దు నియంత్రణలను విధించింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త జంట వినూత్న నిర్ణయం తీసుకుంది.



అమెరికాలోని Maine ప్రాంతానికి చెందిన Lindsay, కెనడా దేశానికి చెందిన Alex ఇరువురు వివాహం చేసుకోవాలని భావించారు. నోవా సోషియాలో వివాహాన్ని ప్లాన్‌ చేసుకున్నారు. కరోనా నియంత్రణలతో లిండ్సే ఫ్యామిలీ వివాహానికి హాజరు కాలేదు. తమ వివాహానికి కొత్తగా ప్లాన్ చేసి ఇరు కుటుంబాలను ఆహ్వానించారు.



సరిహద్దు ప్రాంతంలో వంతెనపై వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరని పెళ్లి వేడుకను లిండ్సే తల్లితండ్రులు అమెరికన్‌ జలాలపై పడవమీద కూర్చుని వీక్షించారు.



సరిహద్దుల మధ్య వివాహం చేసుకునేందుకు లిండ్సే, అలెక్స్‌లు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూనే కేవలం 30 మంది అతిధులనే ఆహ్వానించారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఎంతో థ్రిల్లింగ్ గా ఉందంటున్నారు.