విమానానికి మాస్క్ ..భలేగుందే డిజైన్..

Indonesia flight mask : మాస్క్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మనిషి జీవితంలోనూ ఓ భాగమైపోయింది. కరోనా పుణ్యమాని మాస్క్ పెట్టుకోకుండా బైటకెళితే అయ్యో..ఏదో మరచిపోయామే అనే ఫీలింగ్ కలిగేంతగా మనిషి శరీరంలో భాగంగా మారిపోయింది మాస్క్.
కొంత మందైతే వారి పెంపుడు జంతువులకు కూడా మాస్కులు పెడుతున్నారు. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఓ విమానానికి భారీ మాస్కు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ గా మారిపోయాయి.అది చూసిన వారంతా ఏమీ చిత్రం? అంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ విమానానికి మాస్క్ ఎందుకు పెట్టారో చూద్దాం..
ఇండోనేషియాకు చెందిన క్యారియర్ గరుడ గతవారం ఐదు విమానాలను ఫేస్‌మాస్క్‌లతో నింపేసింది. వాటి ముక్కు భాగం వద్ద నీలిరంగులో మాస్క్‌ల పెయింట్ చేశారు. నిజంగానే ఆ విమానం మాస్క్ ధరించిందా అనే అనుమానం కలిగేలా అందమైన నీలిరంగు మాస్క్ లాంటి పెయింట్ వేశారు.
దీనికి అర్థం విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణీకులు..సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అవగాహన కల్పించేందుకు గరుడ ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌బస్ A330-900neo లో ఒకదానికి జోడించబడిందిమూతి (ముందు భాగం) మాస్క్ లాంటి పెయింట్ వేశారు.
60 మంది పెయింటర్లు 120 గంటలపాటు శ్రమించి విమానాలకు రంగులు వేశారు. ఈ ఆలోచన చూసి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహమ్మారిని కట్టడి చేయాలంటే ఇంకా కొంత కాలం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని పేర్కొంటున్నారు.