లాక్ డౌన్ ఉల్లంఘించిన యువకులు…వెరైటీ శిక్ష విధించిన మధ్యప్రదేశ్ పోలీస్

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 10:23 AM IST
లాక్ డౌన్ ఉల్లంఘించిన యువకులు…వెరైటీ శిక్ష విధించిన మధ్యప్రదేశ్ పోలీస్

Updated On : April 27, 2020 / 10:23 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించబడింది. దీంతో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, నిత్యావసర సరుకులకు మాత్రమే ఇంటి నుంచి ఒక్కరూ మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఇదేమి పట్టించుకోకుండా పోలీసులు ఎంతచెప్పినా వినకుండా బయటకు వస్తున్నారు.

అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించిన ముగ్గురు యువకులకు ఓ పోలీస్ అధికారి వినూతన్న రీతిలో బుద్ధి చెప్పారు. మధ్యప్రదేశ్ లోని బేతుల్ నగరంలో ముగ్గురు యువకులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాలేజీ రోడ్డుపై బైక్ మీద తిరుగుతూ కనిపించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా,వ్యాయామం చేయటానికి బయటకు వచ్చామని వాళ్లు సమాధానమిచ్చారు. ఆ సమాధానంతో అక్కడున్న ఓ పోలీస్ అధికారి తనతో కలిసి పుషప్స్ తీసి గెలవాలనే ఛాలెంజ్ ని విసిరాడు.

ముగ్గురూ తలో 30 ఫుషప్స్‌ చేయాలని, లేదా బండికి సంబంధించిన పత్రాలు లేకుండా నడడిపినందుకు రూ.1000 జరిమానా కట్టాలని ఆదేశించాడు. అయితే ఆ ముగ్గురు చాలెంజ్‌ స్వీకరించిన్పటికీ.. ఇద్దరు 10 ఫుషప్స్‌ చేయగా, వారిలో ఒకరు 20 మాత్రమే చేశాడు. చివరకు ఆ ఛాలెంజ్ లో  ఓటమిని అంగీకరించి జరిమానా చెల్లించారు. లాక్ డౌన్ సమయంలో బయటకు రావొద్దని, ఇంట్లోనే ఉండి వ్యాయామాలు చేసుకోవాలని సంతోష్ పటేల్ సూచించారు.