ప్రేమించిన కుక్కతోనే వాలెంటైన్స్ డే ను జరుపుకున్న యువకుడు

  • Published By: veegamteam ,Published On : February 14, 2020 / 10:51 AM IST
ప్రేమించిన కుక్కతోనే వాలెంటైన్స్ డే ను జరుపుకున్న యువకుడు

Updated On : February 14, 2020 / 10:51 AM IST

ప్రపంచ వ్యాప్తంగా ‘వాలెంటైన్స్ డే’ ఎంతో ఉత్సాహం, ఆనందంతో జరుపుకుంటారు. ప్రేమికులు తమకి ఇష్టమైన వారికి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కొంతమంది తమకి ఇష్టమైన వారితో కలిసి వారి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ రోజును సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే వాలెంటైన్స్ డే అంటే లవర్స్ తో మాత్రమే జరుపుకునేది కాదు, నచ్చిన ఎవరితోనైనా వాలెంటైన్స్ డేను జరుపుకోవచ్చని ఓ యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫోటో వైరల్ గా మారింది. వాలెంటైన్స్ డే సందర్భంగా తనకి ఎంతో ఇష్టమైన కుక్క పట్ల ఉన్నప్రేమ, అది వారి జీవితాలను ఎలా మార్చిందనే విషయం గురించి వివరించాడు. కుక్క వారి జీవితాలను ఎలా మార్చిందనే దాని గురించి తెలుసుకుందాం. 

puppy

ఒక సాయంత్రం ఆ వ్యక్తి తన స్నేహితులతో కలిసి నడుచుకుంటు వెళ్తుండగా చిన్న కుక్క పిల్లలను చూశాడు. ఆ కుక్క పిల్లపై మిగతా కుక్కలు విరుచుపడటం గమనించాడు. ఆ సమయంలో వాటిని అదిలించి కుక్క పిల్లలను కాపాడాడు. ఆ కుక్కను పెంచుకుంటున్నా యజమాని ఎవరు అక్కడ లేకపోవటంతో దాని ఇంటికి తీసుకువెళ్లాడు. ఎవరైనా ఆ కుక్కను వెతుకుంటు వస్తారని పది రోజులు పాటు చూశాడు. ఎవరు రాకపోవటంతో దాని పెంచుకోవాలని అనుకున్నాడు. దాని పేరు దేవదూత అని పెట్టాడు. అప్పటి నుంచి ఆ కుక్క అతని జీవితంలో ఒక భాగమైంది.

dog
  
ఆ కుక్క పుట్టిన రోజున మెుత్తం ఇంటిని అలంకరించి సెలబ్రేట్ చేస్తున్నాడు. ఆ కుక్క వారి జీవితాల్లోకి రావటం ఎంతో సంతోషంగా ఫీలవుతున్నాడు. ఈ విషయాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే సోషల్ మీడియాలో షేర్ చేసింది. కుక్కకు డ్రెస్ వేసి, దాన్ని ముద్దు పెట్టుకుంటున్నా యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పోస్ట్ చూసిన వారంతా ‘నా వాలెంటైన్‌ను నా చుట్టూ ఉన్న కుక్కలతో గడపాలని నేను కోరుకుంటున్నాను’. తన కుక్క పిల్లని తన బిడ్డలాగే ప్రేమించే వ్యక్తి అతను చాలా అందంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కి బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా లైక్ కొట్టారు.