Friendship of bees : ఫ్రెండ్‌ని కాపాడటానికి తేనెటీగలు ఏం చేశాయంటే?

కలిసి ఉంటే ఎలాంటి సమస్యను అయినా పరిష్కరించవచ్చు.. కష్టంలో ఉన్న స్నేహితుల్ని కూడా కాపాడవచ్చు అని నిరూపించాయి కొన్ని తేనెటీగలు. తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి కొన్ని తేనెటీగలు కలిసికట్టుగా చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Friendship of bees

Friendship of bees :  స్నేహితులు ప్రాణాపాయస్థితిలో (trouble) ఉంటే మనుష్యులు మాత్రమే సాయం చేసుకుంటారు అనుకోవడం పొరపాటు.. జంతువులు, కీటకాలు ఇవి కూడా తమ తోటివారికి సాయం చేయడానికి ఏ మాత్రం వెనక్కి తగ్గవు. ఓ తేనెటీగను (bee) కాపాడటానికి తేనెటీగల గ్రూపు అందించిన సాయం చూస్తే ఔరా అంటారు.

Cheetah Plays With Tortoise: చిరుత, తాబేలు స్నేహం.. నెట్టింట్లో వీడియో వైరల్‌.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

స్నేహితులు (friends) ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని కాపాడటానికి చాలా గట్స్ కావాలి. తన ప్రాణాలు అడ్డువేసేంత సాహసం చేయాలి. మనుష్యుల్లో మాత్రమే ఇలాంటి సాహసాలు (adventure) చేసేవారి కథలు మనం చూస్తూ ఉంటాం. కానీ జంతువులు, క్రిమికీటకాలు (Insects) సైతం తమ వారిని కాపాడేందుకు పోరాటం చేస్తాయి. అందుకోసం కలిసికట్టుగా కూడా ముందుకు వెళ్తాయి. ఈ విషయాన్ని తేనెటీగలు రుజువు చేసాయి. ఓ తేనెటీగ నీటి బొట్టు మధ్య చిక్కుకుపోయి బయటకు రాలేకపోయింది. కొన్ని తేనెటీగలు దానిని బయటకు తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేశాయి. ఈలోపు మరో తేనెటీగ ఆలస్యం చేయకుండా పైకి ఎగురుతూ దాన్ని బయటకు లాగి ప్రాణాలు కాపాడింది.

సోషల్ మీడియాలో పరిచయం-స్నేహంతో ఇంటికి వచ్చి దోచుకెళ్లారు

ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. వీటిని చూసి మనుష్యులు ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని కొందరు.. కలిసి ఉంటే ఎలాంటి సమస్యనుంచైనా బయటకు రావచ్చనే విషయాన్ని తేనెటీగలు నిరూపించాయని కొందరు కామెంట్లు పెడుతున్నారు. నిజంగానే ఈ తేనెటీగలు ఓ మంచి పాఠాన్ని అయితే నేర్పిస్తున్నాయి.