పుట్టగానే శిశువు ఏడుస్తూ.. డాక్టర్ మాస్క్ లాగేసింది.. త్వరలో మాస్క్ తీసే రోజులు వస్తున్నాయా?!

  • Publish Date - October 15, 2020 / 08:19 PM IST

newborn baby : ప్రపంచమంతా కరోనావైరస్ వ్యాపించింది. మహమ్మారి కారణంగా ఇప్పుడు మాస్క్ లేకుండా బయటకు రాలేని పరిస్థితులివి.. కరోనాతో నిండిపోయిన ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సాధారణ జీవితంలోకి ఎప్పుడు తిరిగి వస్తామో తెలియని పరిస్థితి. నవజాత శిశువు ఏడుస్తూ కరోనా పీడిత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. పుట్టగానే ఏడుస్తూ..ఆ చిట్టి లేత చేతులతో డాక్టర్ ధరించిన ఫేస్ మాస్క్ లాగేసింది.



అంటే.. త్వరలో మనం ఫేస్ మాస్క్ తీసే రోజులు రాబోతున్నాయి.. అందరూ ఎప్పటిలానే సాధారణ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు? అనే సంకేతాన్ని ఇచ్చేలా ఉందంటున్నారు. వాస్తవానికి ఈ ఫొటో పాతది.. ఇటలీలో గత మార్చినెలలో ఈ శిశువు జన్మించింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్నదేశాల్లో ఒకటైన ఇటలీలో ఈ ఆడ శిశువు పుట్టింది..



పుట్టిన ఆడ శిశువును ఎత్తుకున్న డాక్టర్ సర్జికల్ మాస్క్ ను లాగేసిన ఫొటో ఒక వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి సమయంలో ఈ ఫొటో వైరల్ కావడంతో అందరూ కరోనా వెళ్లిపోతుందనడానికి ఇదే సంకేతమంటున్నారు. యూఏఈ ఆధారిత గైనకాలిజిస్ట్ Dr Samer Cheaib ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ ఫొటోను షేర్ చేశారు.

అప్పుడే పుట్టిన ఆడ శిశువు డాక్టర్ మాస్క్ లాగేందుకు ప్రయత్నించిన ఫొటో ఇది.. దీనికి ఆ డాక్టర్ ‘మనమంతా కోరుకుంటున్నట్టుగా.. త్వరలో ముఖంపై మాస్క్ తీసే రోజులు రాబోతున్నాయనడానికి ఇదే సంకేతం’ అంటూ ఇన్ స్టా, ఫేస్ బుక్ లో ఫొటోను షేర్ చేశారు.



సోషల్ మీడియాలో ఈ బేబీ ఫొటోకు వేలాది లైకులు వచ్చాయి. ఫొటోను చూసిన చాలామంది నెటిజన్లు.. మంచి భవిష్యత్ రాబోతుందనడానికి ఈ ఫొటోనే సంకేతంమంటూ కామెంట్లు పెడుతున్నారు. అంటే.. త్వరలో మాస్క్ తీయబోతున్నామనమాట.. అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు