సోషల్ డిస్టెన్స్ డ్రెస్..దగ్గరకు రావటం అస్సలు కుదరదు : వైరల్ వీడియో

social distancing dress : కరోనా అందర్నీ వణికిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు, మరణాలు అధికమౌతున్నాయి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెరైటీ మాస్క్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి పలు సంస్థలు. తాజాగా ఓ మహిళా డిజైనర్ సోషల్ డిస్టెన్ డ్రెస్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ గా మారింది.
వ్యక్తులు ఆరు అడుగుల దూరంగా నిలబడే విధంగా డ్రెస్ ను డిజైన్ చేయడం విశేషం. 12 అడుగుల డ్రెస్ ను కూడా తయారు చేస్తున్నారు. కొంతకాలంగా ప్రయత్నించి విఫలం చెందారు. చివరకు విజయం సాధించారు. ఇది ధరించడం చాలా సులువుగా ఉంటుందని, బరువుగా ఉండదని వెల్లడిస్తున్నారు. అదే రంగు గల మాస్క్ ను కూడా తయారు చేశారు. డ్రెస్ కు సంబంధించిన విశేషాలను ఆమె వీడియో ద్వారా పంచుకున్నారు. డ్రెస్ ను తయారు చేయడానికి 270 మీటర్ల వస్త్రాన్ని ఉపయోగించారు. తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టిందన్నారు. పైపులను ఏర్పాటు చేసి చక్రాలను ఏర్పాటు చేశారు.
https://10tv.in/chinese-company-seeks-permission-to-launch-covid-vaccine-for-public-use/
డ్రెస్ ధరించి నడిచే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా ఉండాలని ఈ విధంగా ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలంలో దీనికి సంబంధించిన ఫొటోసూట్ చేయాల్సి వచ్చిందన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇది అమేజింగ్ డ్రెస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కడ పెడుతారు అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram